- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గవర్నర్ ప్రసంగం ఒక నిమిషం
భోపాల్: సాధారణంగా అసెంబ్లీలో ఇచ్చే గవర్నర్ ప్రసంగంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి విపుల వివరణ ఉంటుంది. ‘నా ప్రభుత్వం ఇటువంటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ప్రయోజనాలందిస్తున్నది’ అనే తరహాలో గవర్నర్ ఉపన్యాసం సాగుతుంది. కానీ, మధ్యప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ లాల్‌జీ టాండన్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కమల్‌నాథ్ సర్కారుకు బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఎన్‌పీ ప్రజాపతిని ఆదేశించిన గవర్నర్ టాండన్ సోమవారం అసెంబ్లీలో కేవలం రెండు నిమిషాలు కూడా ప్రసంగించలేదు. ప్రసంగ పత్రంలోని చివరి పేజీని సుమారు నిమిషమున్నరపాటు చదివి వినిపించారు. ఆఖరికి ఓ సలహాను వదిలారు. గౌరవనీయులైన చట్టసభ్యులు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని సూచించారు.
tags : madhya pradesh, governor, lalji tandon, speech, one minute, floor test