- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బ్రేకింగ్.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మధుసూధనా చారి
దిశ, తెలంగాణబ్యూరో : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార పార్టీలో నేతలకు సడెన్ సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు గులాబీ బాస్ కేసీఆర్. తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై టీఆర్ఎస్ అధిష్టానం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే మధుసూధనా చారిని ఫైనల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు రాజ్ భవన్‌కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో రాజ్ భవన్‌కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ చేరింది. ఈ ఫైల్‌పై గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం ఆమోద ముద్ర వేయడంతో ఆయనకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖాయమైంది.
సిరికొండ మధుసూధనా చారి.. వరంగల్ జిల్లా, పరకాల మండలం నర్సక్కపల్లిలో 1956 అక్టోబరు 13న జన్మించారు. ప్రాథమిక విద్యను స్వస్థలంలోనే పూర్తి చేసిన అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ(ఇంగ్లీష్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మధుసూధనా చారికి భార్య ఉమాదేవి, కుమారులు ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి ఉన్నారు. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్ జిల్లా భూపాలపల్లి అసెంబ్లీ నియోజ వర్గం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఆయన ఎమ్మెల్యీగా ఎన్నికైనారు. 2014 జూన్ 12 నుండి 2019 జనవరి 16 వరకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ తొలి స్పీకర్‌గా పనిచేశాడు. స్వర్గీయ ఎన్టీఆర్ పిలుపుతో మధుసూధనా చారి 1982లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
తెలుగుదేశం పార్టీలో చేరి 1994-99 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి సారిగా చట్టసభలో ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభం అవుతున్న సమయంలో కేసీఆర్‌కు దగ్గరయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ స్థాపనకు 8 నెలల ముందు నుండే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో చారి కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా 1994లో అసెంబ్లీకి మొదటి సారిగా ఎన్నికై వచ్చే సమయం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
దీన్ని చూసి చలించి పోయిన మధుసూధనా చారి పత్తి రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు పురుగుల మందును సభలోకి తెచ్చారు. 2014 సాధారణ ఎన్నికలలో వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి టీఆర్‌ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల్లో ఇదే నియోజక వర్గం నుండి ఓడిపోయారు. అయితే, ఆయనకు మొదటగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఇస్తారని ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఇవ్వకపోవడంతో కొంత సందిగ్ధం నెలకొంది. చివరకు సీఎం కేసీఆర్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇదిలా ఉంటే మండలి చైర్మన్‌గా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.