- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ డ్యాన్స్ క్లాసెస్ చెప్తున్న మాధురి దీక్షిత్
మాధురి దీక్షిత్… గొప్ప నటి మాత్రమే కాదు మంచి గ్రేస్ ఉన్న డ్యాన్సర్ కూడా. ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉండడం వల్ల అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో… డ్యాన్స్ లో మెళకువలు నేర్పిస్తుంది. డ్యాన్స్ విత్ మాధురి పేరుతో సోషల్ మీడియా వేదికగా వారానికి రెండు క్లాసులు చెబుతోంది. ఈ క్లాసుల ద్వారా నేర్చుకున్న డాన్స్ మూవ్స్ ను # LearnAMove # ShareAMove హాష్ ట్యాగ్ లు జోడిస్తూ అప్ లోడ్ చేస్తే… మూడు బెస్ట్ మూవ్స్ సెలెక్ట్ చేసి… డ్యాన్స్ విత్ మాధురి నెలవారీ సబ్ స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారట. ఒక లక్కీ విన్నర్ కు మాధురితో వీడియో కాల్ మాట్లాడే చాన్స్ ఇస్తారట.
ఈ క్రమంలో ఒకప్పటి సూపర్ హిట్ సాంగ్ ఏక్ .. దో.. తీన్… సాంగ్ పై తనదైన డ్యాన్స్ మూవ్స్ తో ఆకట్టుకుంది మాధురి. ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఈ సాంగ్ కు తానే కొరియోగ్రఫీ చేశానని… మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అని తెలిపింది. ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ డ్యాన్స్ నేర్చుకోవాలని.. ప్రేమను వ్యాప్తి చేయాలని కోరింది మాధురి. కాగా ఎవర్ గ్రీన్ బ్యూటీ మాధురి తనదైన స్టెప్పులతో ప్రశంసలు అందుకుంటోంది… ఎన్నెళ్లు అయినా ఆ గ్రేస్ తగ్గదని … మీరు డాన్సింగ్ క్వీన్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నెటిజన్లు.
Tags : Madhuri Dixit, Dance With Madhuri, ShareAMove, LearnAMove, Bollywood