- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి అధ్యక్షుడిగా మాధవరం నరేందర్.. ఏకగ్రీవంగా కమిటీ ఎన్నిక
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా మాధవరం నరేందర్‌రావు తిరిగి ఎన్నికయ్యారు. బుధవారం కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన ఎన్నికల ప్రభుత్వ అదనపు కార్యదర్శి టి.శేఖర్ నుంచి నియామక పత్రం అందుకున్నారు. సంఘం కార్యవర్గం 2021 నుంచి 2024 వరకు బాధ్యతలు నిర్వహించనుంది. 26 మందితో కూడిన కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా షేక్ యూసఫ్ మియా, కోశాధికారిగా రేండ్ల రాజేశం, ఉపాధ్యక్షులుగా పి.లింగమూర్తి, పి.శ్యాంసుందర్, కే రాజేశ్వర్ రెడ్డి, ఎన్.మంగమ్మ, కార్యదర్శులుగా వి.రమేష్, కే శ్రీనివాస రావు, ఎం. నవీన్ కుమార్, వి. ఉమా నాగలక్ష్మి, ప్రచార కార్యదర్శిగా పి.శివాజీ ఎన్నికయ్యారు.
సాంస్కృతిక కార్యదర్శిగా ఎన్. అరవింద్ గౌడ్, క్రీడా కార్యదర్శిగా టి.స్వరణ్ రాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా బి. దేవ రాజు, సయ్యద్ అబ్దుల్ ఖదీర్, జి. కరుణ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోఆర్డినేటర్లుగా కే చలపతి రెడ్డి, షేక్ మలేఖ, కార్యవర్గ సభ్యులుగా జి. ప్రశాంత్ కుమార్, పి.సింధూరి, కే సమ్మయ్య, మీర్ అహ్మద్ అలీ, పి.చంద్రకళ, బి.కిషన్ రావు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రీ మాధవరం నరేందర్ రావు గారిని పలువురు సచివాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
ఉద్యోగ సంక్షేమానికి పాటుపడతా
తెలంగాణ సచివాలయంలో ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఉద్యోగ పరమైన సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని, వారి సంక్షేమం కోసం పాటు పడతానని అధ్యక్షుడు మాధవరం నరేందర్ రావు అన్నారు. సచివాలయ ఉద్యోగుల పదోన్నతులలో ఏర్పడిన అడ్డంకులను తొలగించి గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని స్థాయిల్లో సుమారు 200 మందికి ప్రమోషన్స్ సాధించుకున్నామని, సీఎం కేసీఆర్ చొరవతో కొత్త పోస్టులు సృష్టించుకున్నామన్నారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.