- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ సినిమా బడ్జెట్ పవన్ సినిమా మార్నింగ్ షో కలెక్షన్ అంత ఉండదు : ప్రకాశ్ రాజ్
దిశ, వెబ్‌డెస్క్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో టాలీవుడ్‌లో రాజకీయం వేడెక్కింది. అటు ప్రకాశ్ రాజ్ ఇటు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్నికల హీట్ పెంచుతున్నారు. తాజాగా.. ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో మరోసారి సంచలనంగా మారాయి. ఇటీవల ‘మీరు పవన్‌కల్యాణ్ వైపు ఉన్నారా? లేక ఇండస్ట్రీ వైపు ఉన్నారా’ అని మంచు మాట్లాడటంపై ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ విషయంలో మంచు ప్యానెల్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అందరి వారు అని, వారిని ఎందుకు ఇందులోకి లాగుతున్నారని అటు మంచు విష్ణుతో పాటు నటుడు నరేష్‌పై కూడా ప్రకాశ్ రాజ్ సీరియస్ అయ్యారు. తాను తెలుగువాడిని కాకపోయిన ఎదిగింది టాలీవుడ్‌లోనే అని గుర్తుచేశారు. తెలుగు సినిమాల్లో నటించి రెండుసార్లు జాతీయ అవార్డులు, తొమ్మిది నంది అవార్డులు అందుకున్నాను, అవతలి ప్యానెల్‌లో ఎవరైనా దీనిపై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని ఒకసారి విశ్లేషించాలి. ఆయన మొత్తం ఇండస్ట్రీ గురించి ఆలోచించి మాట్లాడారు. ప్రస్తుతం ఆయన ఏ సినిమా రిలీజ్‌కు దగ్గర్లో లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల కోసమే ఆయన మాట్లాడారు. అలాంటి పవన్ కల్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు మంచు విష్ణు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంగేగాకుండా.. పవన్ కల్యాణ్ సినిమా మార్నిగ్ షో కలక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మొదట నటుడు.. ఆ తర్వాతే రాజకీయనాయకుడు అని వెల్లడించారు. మీకు పొలిటికల్ అజెండా ఉంటే మీరు చూసుకోండి. ఏపీ రాజకీయాలు నాకు తెలియవు. ఇండస్ట్రీ పరంగా మాట్లాడారు. దానిపై మనం చర్చించుకుందాం. ఆయనకు నాకు సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారు. అయితే, సినిమా విషయానికొస్తే ‘‘నేను నంద.. ఆయన బద్రి’’ అని స్పష్టం చేశారు.