- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వావ్! అతనికి..చిప్స్ ప్యాకెట్ నిండుగా వచ్చిందోచ్ !
దిశ, వెబ్ డెస్క్: బుజ్జి పాప నుంచి వృద్ధుల వరకు అందరూ ఇష్టపడే మోస్ట్ ఫేవరేట్ స్నాక్స్ ‘ఆలూ చిప్స్’. వాటిని తినడం మొదలుపెట్టినా, వాటి టేస్ట్‌కు అలవాటు పడిపోయినా, ఇక వాటిని తినకుండా ఉండలేం. అంతగా అడిక్ట్ అయిపోతాం. సాల్ట్ చిప్స్, మసాలా చిప్స్, చిల్లీ చిప్స్, స్పైసీ చిప్స్, టమాటా చిప్స్ అబ్బో ..వీటి జాబితా పెద్దదే. ఏ రుచైనా ఇష్టంగా తినేస్తారు. లాక్‌డౌన్ వేళలో అత్యధికంగా అమ్ముడుపోయిన స్నాక్స్‌లో చిప్స్‌కు అగ్రతాంబులాం దక్కకపోయినా టాప్ ఫైవ్‌లో నిలిచింది. అంతేకాదు కొవిడ్ టైంలో బయట ఇవి దొరక్కపోతే..ఇంట్లోనే ఆలుతో ప్రయోగాలు చేసినా వారికి తక్కువేం లేదు. ఎన్నో బ్రాండ్లు ఆలూ చిప్స్‌ను అందిస్తున్నాయి. కానీ, చిప్స్ ప్యాకెట్‌ను గమనిస్తే..చాలా పెద్దగా ఉంటాయి. కానీ, తీరా దాన్ని విప్పి చూస్తే ఓ పది, పదిహేను చిప్స్ మాత్రమే అందులో ఉంటాయి. అందులో పూర్తిగా గాలి నింపేసి..ప్యాక్ చేయడమే ఇందుకు కారణం. అయితే, ఓ చిప్స్ ప్రేమికుడికి ఫుల్ ప్యాకెట్ ఆఫ్ చిప్స్ వచ్చాయంట..మీకు తెలుసా? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి..
ట్విట్టర్‌లో డాన్ అనే పేరుతో ఉన్న ఓ నెటిజన్ ఇటీవలే ఓ లేస్ చిప్స్ ప్యాకెట్ దుకాణం నుంచి కొనుగోలు చేసుకున్నాడు. అతను దాన్ని ఓపెన్ చేసి చూడగా ఆ ప్యాకెట్ నిండుగా చిప్స్ ఉండటంతో ఒకింత ఆశ్చర్యంతోపాటు ఆనందంతో గెంతులేశాడు. ఆ చిప్స్ ప్యాకెట్ ప్యాక్ చేసిన వ్యక్తికి బిగ్ థ్యాంక్స్ కూడా చెబుతున్నాడు. డాన్..లాటరీలో బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్లు ఫీలైపోయాడు. వెంటనే ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ‘షౌట్ అవుట్. 8043000162’అనే సీరియల్ నెంబర్ ఉన్న లేస్ ప్యాకెట్ ఫుల్ చిప్స్‌తో నిండి ఉంది’ అనే డాన్ తన వాల్‌పై రాసుకోచ్చాడు. ఈ ట్వీట్ నెట్టింట్లో ట్రెండింగ్‌గా నిలిచింది. అంతేకాదు.. చిప్స్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. డాన్‌ను లక్కీఫెల్లోగా సోషల్ మీడియా కీర్తిస్తున్నది.
రెడిటర్ అనే వెబ్‌సైట్ అప్పట్లో చిప్స్ టాప్ బ్రాండ్స్ లేస్, బింగో, హాల్దిరామ్స్‌పై ఓ చిన్నపాటి సర్వే చేసింది. అదేంటంటే.. ఈ మూడు కంపెనీలు అందిస్తున్న పది రూపాయల చిప్స్ ప్యాకెట్‌లో ఏ కంపెనీ ఎక్కువగా చిప్స్ అందిస్తుందో తెలుసుకునేందుకు ప్రయత్నించింది. అందులో ‘లేస్’ కంపెనీ లీస్ట్‌లో నిలవడం గమనార్హం. 1920లో హెర్మన్ లీ అనే వ్యక్తి .. ఆలూ చిప్స్ తయారు చేసి.. అమ్మడం ప్రారంభించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ.. చివరకు ‘లేస్’ అనే బ్రాండ్‌ను సృష్టించాడు. లేస్ ప్రారంభమైన తర్వాత.. చాలా కంపెనీలు.. చిప్స్ తయారీని మొదలుపెట్టాయి.
https://twitter.com/AgentCodyBlacks/status/1299762490021163012