క్రికెటర్ అరుదైన రికార్డు.. 8వ స్థానంలో వచ్చి సెంచరీ..

by Shyam |
క్రికెటర్ అరుదైన రికార్డు.. 8వ స్థానంలో వచ్చి సెంచరీ..
X

దిశ, స్పోర్ట్స్: వన్డే క్రికెట్‌లో ఐర్లాండ్ క్రికెటర్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ చేసిన మొట్ట మొదటి బ్యాట్స్‌మాన్‌గా ఐర్లాండ్ క్రికెటర్ సిమి సింగ్ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సిమి సింగ్ సెంచరీ బాదాడు. 8వ స్థానంలో వచ్చిన సిమి సింగ్ అజేయ సెంచరీ చేసినా జట్టును మాత్రం గెలిపించలేక పోయాడు. తొలుత సౌతాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 346 పరుగులు చేసింది.

ఓపెనర్లు జానేమన్​ మలన్‌ (177 నాటౌట్‌), డికాక్‌ (120) భారీ శతకాలతో చెలరేగారు. చేజింగ్‌లో ఐర్లాండ్‌ 47.1 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. చివర్లో వచ్చిన సిమి సింగ్ సెంచరీతో సౌతాఫ్రికా విజయాన్ని ఆలస్యం చేయగలిగాడు. అంతకు మునుపు ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మాన్ సామ్ కర్రన్ చేసిన 95 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. కాగా, సిమి సింగ్ పంజాబ్ తరపున అండర్ 14, అండర్ 17 క్రికెట్ ఆడాడు. 2017లో ఐర్లాండ్ పౌరసత్వం లభించడంతో అక్కడకు వెళ్లి క్రికెట్ కొనసాగించాడు. అతడి ప్రదర్శనకు జాతీయ జట్టులో స్థానం లభించింది.

Advertisement

Next Story

Most Viewed