ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు తక్కువే!

by Harish |
Smartphone
X

దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ఏడాదిలో కొత్త ఫోన్‌లను కొనే సమయంలో డిస్కౌంట్లు, ఆఫర్లను తక్కువగా పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీలో కీలకంగా ఉపయోగించే సెమీకండక్టర్లు, డిస్‌ప్లేలు, మెమొరీ వంటి విడిభాగాల ధరలు పెరుగుతుండటంతో కంపెనీలు ఆ భారాన్ని డిస్కౌంట్, ఆఫర్లలో తగ్గింపునకు దారి తీస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ధరల తగ్గింపు కూడా ఉండకపోవచ్చని, గతేడాది చివర్లో పండుగ సీజన్ నుంచి రికార్డు స్థాయిలో డిమాండ్‌ను చూస్తున్న కంపెనీలు తాజాగా కరోనా కేసులు పెరగడం స్మార్ట్‌ఫోన్ తయారీదారులపై పడుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఆఫ్‌లైన్ రిటైలర్లు మార్చి అమ్మకాలు తగ్గాయని చెబుతున్నారు. సాధారణంగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల మార్జిన్ 5-7 శాతం అమ్ముడవుతుండగా, ప్రీమియం విభాగంలో 15-20 శాతం అమ్ముడవుతాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ చెప్పారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రేంజ్ స్మార్ట్‌ఫోన్ల ధరల్లో తగ్గింపులను ప్రకటిస్తాయో చూడాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed