- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంతపనిచేశారు… ప్రేమకు కులం అడ్డొస్తుందని….
దిశ, నిర్మల్ రూరల్: తెలిసి తెలియని వయస్సులో యువతియువకులు ఆకర్షితులై ప్రేమలో పడడం, ప్రేమలో అటంకాలు వస్తే ఊహించలేని నిర్ణయాలు తీసుకుని కన్నవారికి కన్నీరు మిగిల్చుతున్నారు. అలాంటి సంఘటనే మామడ మండలంలోని పోన్కల్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. పోన్కల్ గ్రామానికి చెందిన నిక్షిత (18), హరీష్ (20)లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
అయితే వీరి ప్రేమకు కులం అడ్డోచింది. కులాలు వేరువేరు అవడంతో వీరి ప్రేమను కుటుంబీకులు ఒప్పుకోరని మనస్థాపానికి గురయ్యారు. దీంతో నిక్షిత ఇంట్లో ఎవ్వరులేని సమయంలో ఒకే చీరతో ఇద్దరు ఉరివేసుకొని ప్రాణలు విడిచారు. ఆత్మహత్యకు ముందు హరీష్ తన వాట్సప్ స్టేటస్‌లో వారి ప్రేమకు కులం అడ్డోస్తుందనే కారణంగా చనిపోతున్నట్లు పెట్టాడు. ఈ హృదయవిదాకరణ ఘటన చూసిన కుటుంబీకులు, గ్రామస్థుల కళ్లు చెమర్చాయి. విషయం తెలిసిన ఎస్సై వినయ్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.