పోలీస్ కస్టడీలో ఉన్న ప్రేమికుడు మృతి

by Anukaran |   ( Updated:2020-08-19 08:20:06.0  )
పోలీస్ కస్టడీలో ఉన్న ప్రేమికుడు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : తాను ప్రేమించిన చెలికాడుని దూరం చేస్తున్నారనే మనస్థాపంతో ఓ యువకుడు పోలీస్ కస్టడి నుంచి తప్పించుకునే క్రమంలో మృతిచెందాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. ప్రకాశం జిల్లా యాడ్లూరుపాడుకు చెందిన వెంకట్రావు క్యాటరింగ్ పనులు చేస్తున్నాడు. అతడు కందుకూరులోని జనార్ధన కాలనీకి చెందిన ఓ బాలిక ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి ఈ నెల 10న ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌కు వచ్చారు. బాలిక మిస్సింగ్ కావడంతో తల్లిదండ్రులు ఈనెల11న కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ ప్రారంభించిన పోలీసులు.. ప్రేమికులు హైదరాబాద్‌లోని కుకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ వచ్చిన పోలీసులు కేపీహెచ్బీలో వారిని అదుపులోకి తీసుకోని కందుకూరుకు తిరిగి పయనమయ్యారు. కారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం కొత్తగూడెం సమీపంలోకి రాగానే యువకుడు తనకు వాంతులు అవుతున్నాయని, కారు ఆపాలని పోలీసులను కోరాడు. పోలీసులు కారు ఆపగానే బాలికను అక్కడే వదిలేసి పరారీ కావడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో అటుగా వచ్చిన లారీ ఢీకొని అక్కడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed