హైవేపై లారీలో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్

by Shyam |
హైవేపై లారీలో మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, నిజామాబాద్ రూరల్ : జిల్లాలోని డిచ్‌పల్లి మండలంలో 44 వ జాతీయ రహదారి మలుపు వద్ద నాగ్‌పూర్ వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. ఈ ప్రమాద ఘటనలో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్ సత్పాల్ సింగ్(42) అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల ప్రకారం.. లారీ హైదరాబాద్ నుండి నాగపూర్ వైపు జాతీయ రహదారి 44పై బొప్పాయి పండ్లు నింపుకొని వెళ్తున్న లారీ అదుపు తప్పి హైమాస్ లైటింగ్ స్థంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ లారీ క్యాబిన్‌లో ఇరుక్కు పోయి మృతి చెందగా, క్లీనర్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డాడు. ఒక్కసారిగా లారీలో మంటలు చెలరేగడంతో స్థానికులు.. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో జాతీయ రహదారిపై దాదాపు గంటసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed