- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ ఎన్నికల్లో మాజీ సీఎంపై పోటీ.. క్లారిటీ ఇచ్చిన HERO సంజయ్ దత్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ విలక్షణ నటుడు సంజయ్ దత్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేవలం హిందీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక భాషల్లో నటించి ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ముఖ్యంగా కేజీఎఫ్-2, లియో వంటి చిత్రాలతో సౌత్‌లోనూ సపరేట్ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాల్లోనూ నటిస్తున్నారు. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్‌లో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్‌పై ఉంది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి ప్రారంభమైన వేళ సంజయ్ దత్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నట్లు వార్తలు విస్తృతమయ్యాయి.
హర్యానా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు ప్రత్యర్థిగా కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారనే వార్తలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటాడని తెలుస్తోంది. అయితే, ఈ పుకార్లపై సంజయ్ దత్ స్పందించారు. ఈ మేరకు సోమవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో తాను చేరడం లేదని కుండబద్దలు కొట్టారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఇంట్రస్ట్ ఉంటే అధికారికంగా ప్రకటించినాకే ఏదో ఒక పార్టీలో చేరుతానని అన్నారు. ఇలాంటి వార్తలు ఎవరూ నమ్మొద్దని చెప్పారు. రాజకీయాల్లోకి తాను వస్తున్నానని వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ చెప్పాలనే ఈ పోస్టు పెడుతున్నట్లు వెల్లడించారు.