ఒపీనియన్ పోల్‌‌‌లో షాకింగ్ ఫలితాలు.. ఏ పార్టీ అధికారంలోకి రానుందంటే..? తెలంగాణలోనూ అంతే..

by Swamyn |   ( Updated:2024-04-16 15:19:26.0  )
ఒపీనియన్ పోల్‌‌‌లో షాకింగ్ ఫలితాలు.. ఏ పార్టీ అధికారంలోకి రానుందంటే..? తెలంగాణలోనూ అంతే..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే మరోసారి ఎన్డీయే ప్రభుత్వమే ఏర్పడుతుందని, నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది. దేశంలోని మొత్తం 543 స్థానాలకుగానూ అధికార కూటమి ఏకంగా 393 నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తుందని, ఇందులో ఒక్క బీజేపీయే 343 స్థానాల్లో సత్తాచాటుతుందని పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి(టీఎంసీ మినహా)కి గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని వెల్లడించింది. ప్రతిపక్ష కూటమి కేవలం 99 స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తుందని తెలిపింది. టీఎంసీ, వైసీపీ, బీజేడీతోపాటు స్వతంత్రులు మరో 51 స్థానాలను గెలుచుకుంటారని అంచనా వేసింది. ఈ మేరకు ఒపీనియన్ పోల్ వివరాలను ఇండియా టీవీ తమ చానల్‌లో మంగళవారం టెలికాస్ట్ చేసింది. ఈ నెల 1 నుంచి 13వ తేదీ వరకు దేశంలోని మొత్తం 543 నియోజకవర్గాల్లో 1,22,175 మందిని సర్వే చేసినట్టు వివరించింది. వీరిలో 62,350 మంది పురుషులు ఉండగా, 59,825 మంది స్త్రీలు ఉన్నారని పేర్కొంది.

పార్టీల వారీగా..

టీవీ సీఎన్ఎక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, తక్షణమే ఎన్నికలు జరిగితే బీజేపీ 343 సీట్లలో జయకేతనం ఎగురవేసి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో నిలిచే అవకాశముండగా, ప్రతిపక్ష కాంగ్రెస్ 40 సీట్లకు మాత్రమే పరిమితం కానుంది. అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 8 సీట్లలో గెలుపొందనుండగా, టీఎంసీ 19 స్థానాల్లో, సమాజ్‌వాది పార్టీ(ఎస్పీ) 4, జేడీయూ 12, డీఎంకే 17, టీడీపీ 12, ఇతరులు 88 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది.

రాష్ట్రాల వారీగా..

ఆంధ్రప్రదేశ్: మొత్తం 25 (వైసీపీ 10, టీడీపీ 12, బీజేపీ 3)

అరుణాచల్ ప్రదేశ్: మొత్తం 2 (బీజేపీ 2)

అస్సాం: మొత్తం 14 (బీజేపీ 11, ఏఐయూడీఎఫ్ 1, కాంగ్రెస్ 1, ఇతరులు 1)

బిహార్: మొత్తం 40 (బీజేపీ 17, జేడీయూ 12, ఆర్జేడీ 4, ఎల్జేపీ(ఆర్) 3, హెచ్ఏఎం 1 , కాంగ్రెస్ 2, సీపీఐ-ఎంఎల్ 1)

ఛత్తీస్‌గఢ్: మొత్తం 11 (బీజేపీ 11)

గోవా: మొత్తం 2 (బీజేపీ 2)

గుజరాత్: మొత్తం 26 (బీజేపీ 26)

హర్యానా: మొత్తం 10 (బీజేపీ 8, కాంగ్రెస్ 2)

హిమాచల్ ప్రదేశ్: మొత్తం 4 ( బీజేపీ 4)

జార్ఖండ్: మొత్తం 14 (బీజేపీ 12, ఏజేఎస్‌యూ 1, జేఎంఎం 1)

కర్ణాటక: మొత్తం 28 (బీజేపీ 21, జేడీఎస్ 2, కాంగ్రెస్ 5)

కేరళ: మొత్తం 20 (కాంగ్రెస్ -8, సీపీఎం 5, బీజేపీ 3, కేసీఎం 1, ఐయూఎంఎల్ 2, ఆర్ఎస్పీ 1)

మధ్యప్రదేశ్: మొత్తం 29 (బీజేపీ 28, కాంగ్రెస్ 1)

మహారాష్ట్ర: మొత్తం 48 (బీజేపీ 29, శివసేన-(యూబీటీ) 6, ఎన్సీపీ (అజిత్) 2, శివసేన-షిండే 7, ఎన్సీపీ-(శరద్) 2, కాంగ్రెస్ 1, ఇతరులు 1)

మణిపూర్: మొత్తం 2 (బీజేపీ 1, కాంగ్రెస్ 1)

మేఘాలయ: మొత్తం 2 (ఎన్పీపీ 1, కాంగ్రెస్ 1)

మిజోరం: మొత్తం 1 (జెడ్పీఎం 1)

నాగాలాండ్: మొత్తం 1 (ఎన్డీపీపీ 1)

ఒడిశా: మొత్తం 21 (బీజేడీ 11, బీజేపీ 10)

పంజాబ్: మొత్తం 13 (ఆప్ 8, కాంగ్రెస్ 1, బీజేపీ 3, ఎస్ఏడీ 1)

రాజస్థాన్: మొత్తం 25 (బీజేపీ 25)

సిక్కిం: మొత్తం 1 (ఎస్కేఎం 1)

తమిళనాడు: మొత్తం 39 (డీఎంకే 17, ఏఐడీఎంకే 4, బీజేపీ 4, కాంగ్రెస్ 8, ఇతరులు 6)

తెలంగాణ: మొత్తం 17 (కాంగ్రెస్ 8, బీజేపీ 6, బీఆర్ఎస్ 2, ఏఐఎంఐఎం 1)

త్రిపుర: మొత్తం 2 (బీజేపీ 2)

ఉత్తరప్రదేశ్: మొత్తం 80 (బీజేపీ 72, ఎన్డీయూ మిత్రపక్షాలు - ఆర్ఎల్డీ 2, అప్నా దళ్ 2, ఎస్పీ 4, కాంగ్రెస్ 0, బీఎస్పీ 0)

ఉత్తరాఖండ్: మొత్తం 5 (బీజేపీ 5)

పశ్చిమ బెంగాల్: మొత్తం 42 (తృణమూల్ కాంగ్రెస్ 19, బీజేపీ 23, కాంగ్రెస్ 0, లెఫ్ట్ ఫ్రంట్ 0)

అండమాన్ నికోబార్ దీవులు: మొత్తం 1 (బీజేపీ 1)

చండీగఢ్: మొత్తం 1 (బీజేపీ 1)

దాద్రా నగర్ హవేలీ, డామన్, డయ్యూ: మొత్తం 2 (బీజేపీ 2)

జమ్మూ కశ్మీర్: మొత్తం 5 (బీజేపీ 2, నేషనల్ కాన్ఫరెన్స్ 3, కాంగ్రెస్ 0, పిడిపి 0)

లడఖ్: మొత్తం 1 (బీజేపీ 1)

లక్షద్వీప్: మొత్తం 1 (కాంగ్రెస్ 1)

ఢిల్లీ: మొత్తం 7 (బీజేపీ 7 )

పుదుచ్చేరి: మొత్తం 1 (బీజేపీ 1)

మొత్తం సీట్లు: 543 (ఎన్డీయే 393, ‘ఇండియా’ 99, టీఎంసీ+ఇతరులు 51)


Advertisement

Next Story