- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన’
దిశ, మేడ్చల్: అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతుల కల్పనతో మల్లారెడ్డి విశ్వ విద్యాలయంలో విద్యబోధన జరుగుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బుధవారం మైసమ్మగూడలో నూతనంగా రూపొందించిన మల్లారెడ్డి విశ్వవిద్యాలయ లోగో, బ్రోచర్, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా 32 మల్లారెడ్డి విద్యసంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని అన్ని రకాల విద్యా కోర్సులను ఈ మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అందుబాటులోకి తెచ్చిందన్నారు. మల్లారెడ్డి యూనివర్శిటీని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు తెలిపారు. మల్లారెడ్డి విశ్వ విద్యాలయాన్ని దేశంలోనే నెంబర్ వన్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు.