- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్‌డౌన్‌ని కంటెంట్‌గా మారుస్తున్న యూట్యూబర్లు
యూట్యూబ్‌లో ప్రతి వారం తప్పనిసరిగా ఒక వీడియో పెడితేనే సబ్‌స్క్రైబర్లు నిలకడగా ఉంటారు. యూట్యూబర్‌గా విజయం సాధించడానికి నిలకడత్వం చాలా అవసరం. కానీ లాక్‌డౌన్ కారణంగా బయటికి వెళ్లి షూటింగులు చేసే వీలు లేదు. ఒక్కరే సింగిల్‌గా వీడియోలు చేసే వారికి పర్లేదు, కానీ అవుట్‌డోర్ షూటింగులు చేసే యూట్యూబర్ల సంగతేంటి? మరి వీడియో చేయడం ఎలా? అందుకే లాక్‌డౌన్‌నే మన యూట్యూబర్లు కంటెంట్‌గా మార్చుకుంటున్నారు. అందుకే యూట్యూబ్‌లో ఫేమస్ తెలుగు యూట్యూబ్ ఛానళ్లను ఒకసారి పరిశీలిస్తే వారి చివరి నాలుగైదు వీడియోలు లాక్‌డౌన్ గురించే ఉన్నాయి.
ప్రముఖ యూట్యూబ్ ఛానళ్లు మహతల్లి చూస్తే… ఆ ఛానల్ నిర్వహించే జాహ్నవి లాక్‌డౌన్‌ని సరైన సమయంలో సరైన రీతిలో ఉపయోగించుకున్నారు. ఒక నెల క్రితమే క్వారంటైన్ విత్ మామ్, క్వారంటైన్ సైడ్ ఎఫెక్ట్స్ పేరుతో ఆమె చేసిన వీడియోలకు మంచి స్పందన వచ్చింది. ఇక మరొక యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ షో తమ కంటెంట్‌కి తగినట్లుగా విలేజ్‌లో ఆన్‌లైన్ క్లాసులు, విలేజ్‌లో క్వారంటైన్ పేర్లతో రెండు వీడియోలు పెట్టారు. అంతేకాకుండా ఛాయ్‌బిస్కెట్ వారు కూడా దాదాపు ఇలాంటి కంటెంట్‌నే తీసుకొచ్చారు. వీరితో పాటు ఇంకా చాలా వ్యక్తిగత యూట్యూబర్లు లాక్‌డౌన్ సమయంలో తాము ఇంట్లో కూర్చుని చేస్తున్న పనులను, వంటలను తమ సబ్‌స్క్రైబర్లకు చూపించి వారిని అంటిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు సాధారణ సమయాల్లో కంటే లాక్‌డౌన్‌లో పెట్టిన కంటెంట్‌కి వీక్షణలు ఎక్కువగా వస్తుండటంతో మరింత ఇన్నోవేటివ్‌గా ఉండేందుకు యూట్యూబర్లు ప్రయత్నిస్తున్నారు.
సుమక్క ప్రత్యేకం!
ఓ వైపు టీవీ రంగాన్ని ఏలుతూనే యాంకర్ సుమ ఇటీవల యూట్యూబర్‌గా రంగప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆమె కూడా లాక్‌డౌన్ ప్రారంభమైన కొత్తల్లో కరోనా సీజన్‌లో మా ఆయన బంగారం, లాక్‌డౌన్ విత్ ఫ్యామిలీ పేరుతో సింగిల్ వైనింగ్ వీడియోలు చేశారు. కానీ ఎలా ఎన్ని రోజులని చేయగలరు, కొద్దిగా కొత్తగా ఉండాలనుకున్నారో ఏమో… తన టీవీ రంగ అనుభవాన్ని రంగరించి సుమక్క సూపర్ 4, సుమక్క సూపర్ 2 పేరుతో యూట్యూబ్‌లో గేమ్ షో స్టార్ట్ చేసేసింది. ఇందులో టీవీ సెలబ్రిటీలు, యాంకర్లు, సింగర్లతో ఆటలు ఆడిస్తోంది. వాళ్లందరూ ఎవరింట్లో వాళ్లు ఉంటూనే ఇలా సుమక్కతో కలిసి ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఏదేమైనా యూట్యూబర్ల లాంటి వారి కోసం ఈ లాక్‌డౌన్ కాలం కొంత ఉపయోగకరంగానే మారిందని అనుకోవచ్చు.