లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు

by vinod kumar |   ( Updated:2020-04-02 09:14:46.0  )
లాక్ డౌన్ ఉల్లంఘిస్తే రెండేళ్ళ జైలు
X

న్యూఢిల్లీ: దేశంలో పలుచోట్ల లాక్ డౌన్ ఉల్లంఘించిన ఘటనలు, ఆశ వర్కర్లు.. పోలీసులతో పౌరులకు ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష విధించినున్నట్టు తెలిపింది. లాక్ డౌన్ ఉల్లంఘించినవారి పై ఐపీసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 లోని సంబంధిత సెక్షన్ ల కింద కేసు నమోదు చేయాలని కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. రాష్ట్ర సీఎస్ లకు లేఖ రాశారు. గత నెల 24న పేర్కొన్న లాక్ డౌన్ నిబంధనల్లోనే.. లాక్ డౌన్ ఉల్లంఘనులపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005లోని 51 నుంచి 60 సెక్షన్ల వరకు, అలాగే ఐపీసీలోని 188 సెక్షన్ కింద కేసు నమోదు చేయొచ్చని పొందుపరిచినట్టు గుర్తు చేశారు. వీటి ప్రకారం.. లాక్ డౌన్ ఉల్లంఘించినవారు రెండేళ్ల జైలు శిక్షకు అర్హులని, వదంతులు ప్రచారం చేస్తే జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

Tags : Lockdown, measures, violators, jail, two years

Advertisement

Next Story

Most Viewed