- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ : పోచారం
by Shyam |

X
దిశ, బాన్సువాడ : కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల రక్షణ కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యవసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనాపై పోరులో ప్రజలు కలిసికట్టుగా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించి, స్వచ్చందంగా ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Next Story