- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కరోనా’.. అంతా ఖ‘ల్లాస్’!
దిశ, మహబూబ్‌నగర్: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అన్ని కార్యకలాపాలు స్థంభించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్యాలయాలూ
మూతపడ్డాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపండిందనే చెప్పాలి. మద్యం దుకాణాలు మూతపడటంతో రోజూ సుమారు కోటి రూపాయలకుపైగానే ఆదాయం ప్రభుత్వం కోల్పోయింది. గడిచిన 31 రోజుల్లో కేవలం ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన రూ.50 కోట్ల ఆదాయం నష్టపోయామని అధికారులు చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ పైనా..
కరోనా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్‌పైనా పడింది. నిత్యం భూములు, ప్లాట్లు తదితర కొనుగోళ్లు, విక్రయదారులతో కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పాసులు ఇస్తామని చెబుతున్నా పెద్దగా స్పందన రావడం లేదు. మొత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడటంతో సుమారు రూ.25 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వం కోల్పోయింది. ప్రజా రవాణా వ్యవస్థ కూడా పూర్తిగా స్తంభించిపోయి బస్సులు మొత్తం బస్ డిపోలకే పరిమితం కావడం వల్ల సుమారు రూ.47 కోట్ల వరకు నష్టం జరిగినట్టు తెలుస్తోంది.
నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు..
వాహనాల రిజిష్ర్టేషన్ల రూపంలో ప్రభుత్వానికి రోజూ రావాల్సిన అదాయం పూర్తిగా నిలిచిపోయింది. నిత్యం వివిధ వాహనాల రిజిష్ర్టేషన్లతోపాటు ట్యాక్స్‌లు, వివిధ రూపాల్లో ఆదాయం ప్రభుత్వానికి సమకూరేది. కానీ, ప్రస్తుతం అన్ని రకాల సేవలు నిలిచిపోవడంతో దాదాపు రూ.22 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వం నష్టపోయింది. విద్యుత్ శాఖకూ ఆదాయం తగ్గిందని అధికారులు అంటున్నారు. ప్రతి నెలతో పోలిస్తే ఈ నెల బిల్లుల చెల్లింపులు ఆశించిన స్థాయిలో లేవని చెబుతున్నారు. నిత్యం కిటకిటలాడే కార్యాలయాలూ కరోనా దెబ్బకు కొన్ని పూర్తిగా మూతపడగా మరికొన్ని నిడిచిన కూడా ప్రజల నుంచి అంతగా స్పందన లేదంటున్నారు.
Tags: covid 19 effect, corona virus, lock down, all sectors, loss income, economy, bad position