గ్రామాల అభివృద్ధితోనే జీవనోపాధి

by Shyam |
గ్రామాల అభివృద్ధితోనే జీవనోపాధి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల జీవనోపాధి, దేశ అభివృద్ధికి గ్రామాల స్వయం సమృద్ధి ఎంతో అవసరమని గవర్నర్ తమిళిసై సౌందరాజన్ అన్నారు. మహాత్మా గాంధీ స్పూర్తితో గ్రామాలు స్వయం సమృద్ధిని పొందేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ (జిసిఓటి) నిర్వహించిన కార్యక్రమంలో శనివారం గవర్నర్ ప్రసంగిస్తూ స్వయం సమృద్ధి గల గ్రామాలు ఆత్మ నిర్భర భారత్‌కు ఎంతో తోడ్పడతాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ స్వయం సమృద్ధి సాధించిన గ్రామాల నుంచి వలసలు ఉండవన్నారు.

భారతదేశం గ్రామాల్లో నివసిస్తుందని మహాత్మా గాంధీ చెప్పినట్లుగా, సుస్థిర జీవనోపాధిని కల్పించేందుకు గ్రామ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయాన్ని బలోపేతం చేయడంలో చేతులు కలపాలని గవర్నర్ ప్రజలను కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణాభివృద్ధి కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు.

Advertisement

Next Story

Most Viewed