హాట్‌స్టార్ డిజాస్టర్‌గా ‘లైవ్ టెలికాస్ట్’

by Jakkula Samataha |
Kajal Agarwal
X

దిశ, సినిమా: కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్‌లో వైభవ్, ఆనంది కీలక పాత్రల్లో కనిపించిన సిరీస్ ‘లైవ్ టెలికాస్ట్’. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వచ్చిన సిరీస్.. కాజల్‌కు డిజిటల్ డెబ్యూట్ కాగా అభిమానులు హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. కానీ ఫిబ్రవరి 12న హాట్‌స్టార్ ఒరిజినల్స్‌గా రిలీజైన సిరీస్ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ట్రైలర్‌తో ఆసక్తి పెంచినా.. ఏడు ఎపిసోడ్స్‌గా విడుదలైన థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ డ్రామా స్లో నెరేషన్, స్టోరీ డీవియేషన్‌తో ఆడియన్స్‌కు విసుగుతెప్పించింది.

గ్రిప్పింగ్ లేకపోవడంతో నెగెటివ్ టాక్ రాగా.. అతితక్కువ మంది చూసిన హాట్ స్టార్ ఒరిజినల్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. తద్వారా ఇప్పటికే ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న హాట్ స్టార్.. ‘లైవ్ టెలికాస్ట్’ ద్వారా మరో డిజాస్టర్‌ చవిచూడాల్సి వచ్చింది. కాగా టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు దెయ్యాలు ఉన్నాయని ప్రేక్షకులను నమ్మిస్తూ ‘లైవ్ టెలికాస్ట్’ చేయాలని ఒక చానల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుంది. కానీ అక్కడికి వెళ్లిన క్రూ నిజంగానే దెయ్యం ఉందని నిర్ధారణకు వస్తారు. అప్పుడు ఏం జరిగింది? అనేది ‘లైవ్ టెలికాస్ట్’ కథ.

Advertisement

Next Story