లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుందా ?

by vinod kumar |
లైవ్ క్రికెట్ మ్యాచ్ చూడాలనుందా ?
X

దిశ, స్పోర్ట్స్ :
కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా క్రీడా పోటీలన్నీ స్తంభించిపోయాయి. మ్యాచ్‌లకు సంబంధించి లైవ్ ప్రసారాలన్నీ నిలిచిపోవడంతో క్రీడా అభిమానులు పాత మ్యాచ్‌లనే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐసీసీ కూడా తమ పాత ఆర్కైవ్స్‌ను బయటకు తీసి ప్రసారం చేస్తోంది. అయితే త్వరలోనే లైవ్ క్రికెట్ చూసే అవకాశం రాబోతోంది. వనూతు క్రికెట్ బోర్డు దేశవాళీ టోర్నీని నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉండే దీవి పేరే ‘వనూతు’. ఇక్కడ కరోనా ప్రభావం అస్సలు లేదు. దీంతో వనూతు క్రికెట్ సంఘం దేశవాళీ టోర్నీ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ రోజు (శనివారం) మూడు మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు ఆ క్రికెట్ సంఘం అధ్యక్షుడు షాన్ డైట్జ్ చెప్పారు.

ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ఏకైక క్రికెట్ టోర్నీ ఇదే అని.. లైవ్ ప్రసారం చేయబోతున్న క్రికెట్ మ్యాచ్‌లు కూడా ఇవేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా లాక్‌డౌన్ కారణంగా ఇండ్లకే పరిమితమైన క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచెస్ తప్పకుండా ఆనందాన్ని ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, వనూతులో కరోనా ప్రభావం లేకపోయినా స్టేడియంలోనికి ప్రేక్షకులను ఎవరినీ అనుమతించడం లేదని.. కేవలం లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మాత్రమే మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా, వనూతు క్రికెట్ ఫేస్‌బుక్ పేజీలో ఈ లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

Tags: Vanuatu Cricket Board, Cricket, Live Streaming, Corona, Pacific island

Advertisement

Next Story

Most Viewed