- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ది లివింగ్ కబీర్
విశ్వ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని 'నేను చావును నిరాకరిస్తున్నాను' అని హెచ్చరిస్తూ 'ది లివింగ్ కబీర్' పేరుతో ప్రేమ తత్వంతో పీడిత ప్రజల విముక్తికి అంకితమైన జీవితం అని నిశ్చయించుకున్న కవి ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా. ఈ కావ్యంలో మూల వస్తువు ప్రేమ తత్వం. ప్రేమ భావన విశ్వజనీయం, విప్లవాచరణకు ప్రతీకగా 'ది లివింగ్ కబీర్' సాక్ష్యంగా నిలుస్తోంది.
సాయి ఆవేదనకు అక్షర రూపం!
ప్రొఫెసర్ సాయిబాబా సాంస్కృతిక విప్లవకారుడు. శ్రీనాథ మహాకవి 'కాశీఖండం'లో చెప్పుకొన్నట్లు "ఎవరేమన్నా నన్ను నాకేమీ కొరత'' అంటూ సాయి తన విశ్వాసాన్ని విశ్వ మానవాళి పట్ల ప్రేమను 'ది లివింగ్ కబీర్' ప్రేమతత్వం ద్వారా క్రియాశీలకంగా ప్రస్తుత ధ్వనితో వినిపించారు. అతి సామాన్య పద జాలంతో శైలి సూటిదనం, సారళ్యంతో తన భావాలను ఆంగ్ల కవిత్వంతో స్పష్టత, సహేతువాద పటిమతో, ప్రపంచవ్యాప్తంగా పతనమైపోతున్న భవిష్యత్తు, హక్కుల అణచివేతల పట్ల ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోవడానికి కూడా ఈ కవితలు చదవడం అవసరం.
ఆదర్శం కోసం అన్వేషణ
సాయి కృతిలోని ది లివింగ్ కబీర్ లక్ష్యం విశాలమైన వర్గ రహిత విశ్వ శ్రేయస్సు కానీ, సంకుచితమైన హిందూ మత సంస్కృతికి చిహ్నమైన తులసీదాసు రామచరిత కాదు. మహాకావ్య నిర్మాత నన్నయ విశ్వ శ్రేయస్సుకు సాధనమైన భక్తి మార్గాన్ని 'ఆంధ్ర భారతం'తో లోకానికి వ్యక్తం చేస్తే, సాయి తన 'ది లివింగ్ కబీర్' ప్రేమ తత్వంలో ధర్మాధర్మ (ధర్మ-అధర్మ ) సమరంలో, సత్యం కోసం ఒక ఆదర్శం కోసం, సమాజం కోసం అన్వేషణ అతన్ని కళాత్మకంగా నడిపిస్తుంది. ఎంత సామాజిక ప్రేమికుడుగా కనిపిస్తాడో అంతే నిబద్ధతను తన సిద్ధాంత విశ్వాసాలలో ప్రకటిస్తూ ఆచరణాత్మకంగా కనిపిస్తాడు.
పర్వతాలను తొలిగించిన వృద్ధుడు..
ఈ సందర్భంగా మావో పురాతన చైనీస్ కథ "ది పూలిష్ ఓల్డ్ మాన్ హూ రిమూవ్ ది మౌంటెన్స్"లో విప్లవ సంస్కృతికి ప్రతీకగా ప్రయత్నించారు. 'ది లివింగ్ కబీర్' కూడా దీనికి చాలా దగ్గరగా ఉంది. సాయి తన ఆంగ్ల కవిత్వం నవ్య మార్గంలోనే కాక శైలిలో, కల్పనలలో శబ్ద సృష్టిలో, భాష, భావం రచన నవ రూపాలతో కావ్య గమనం వివిధ భావ రూపాలతో చైతన్య పరుస్తూ స్ఫూర్తినిస్తాయి. వారి రచన పద్ధతిలో ప్రవాహ శీలత పాటకు పాటకున్ని తన వెంట నడిపించుకుంటూ వెళుతుంది. కవిత్వంలో తన చారిత్రక దృక్పథం ఏమిటో చెప్పాడు.
దేశీయ సాహిత్య చైతన్యం
డాంటే తన సమకాలికుల అత్రుతను పంచుకున్నాడు. తన కాలం నాటి రాజకీయ పోరాటాలలో పాల్గొన్నాడు. సాయి జీవితాచరణ కూడా వీటికి చాలా దగ్గరగా ఉంది. కబీర్ దోహా ద్విపద రూపంలో రచిస్తే, సాయి మినీ కవిత నడకలతో కొత్త దేశ దేశీయ సమకాలీన సాహిత్య చైతన్య ప్రభావంతో వినూత్న మార్గాన నడిచింది. 'ది లివింగ్ కబీర్' కవితా సంపుటి నవ్య మార్గంతో ప్రపంచ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంతరించుకుంటూ కొత్త తాత్విక అర్థాలతో ఆలోచింపచేస్తుంది.
ఆంగ్లంలో సాయి రాసిన కవిత్వ మూల వస్తువు భావావిష్కరణతో సందర్భోచితంగా అర్థాన్ని, ధ్వని, వాక్య నిర్మాణాలతో, మాతృకలోని అంతర తత్వాన్ని, సౌకుమార్యాన్ని, వ్యంగ్యాదుల్ని వివరిస్తుంది. 9 మంది అనువాదక కవులు అందరూ మూల భావ పరిధిని, మాతృత్వ మర్యాదల్ని దాటని స్వేచ్ఛను పాటిస్తూ మూలకవి హృదయాన్ని అవిష్కరిస్తూ, పాఠకుడి పరిజ్ఞానాన్ని ఒక అడుగుకి ముందుకు తీసుకెళ్లారు. ఇందులో ఇద్దరు కవితలనే తీసుకొని క్లుప్తంగా సమీక్షించాను. అన్ని కవితలను సమీక్షించడం సమంజసం కాదు నేను ఏర్పరచుకున్న నియమం వల్ల.
నిశ్శబ్దాన్ని బద్దలు చేసిన కవిత్వం
పి వరలక్ష్మి గారి అనువాదం చేసిన కవిత శీర్షిక వీధుల వెంట అరుస్తూ వెళ్ళండి/ " మీ గుండె లోతుల్లో / అంత ప్రేమ ఉన్నప్పుడు / ఈ సంక్షుభిత వేళ / ఎందుకు మీ నిశ్శబ్దాన్ని బద్దలు చేయరు''? అన్న ప్రశ్నలోని తాత్వికత ప్రతికాత్మకమైన కవితకి చిహ్నం. ఇందులో ప్రేమ ప్రపంచ పీడిత మానవాళి పట్ల ఉన్న ప్రేమ, విప్లవం పట్ల ఉన్న ప్రేమ, విప్లవోద్యమంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ శతాబ్దాల నిశ్శబ్దంలోంచి మేల్కొని ఐక్య పోరాటానికి సంసిద్ధం కావలసిన సమయం అంటూ అంతర్లీనంగా తెలియజేస్తుంది. అనువాదం చేసిన కవితల్లో నర్మోక్తి నిపుణత, వస్తురూప నిర్మాణము వాళ్ళ ప్రతిభకు నిదర్శనం.
పోరాటంలోనే ప్రేమ లోకం ఆకృతి
గీతాంజలి గారు అనువాదం చేసిన 'ఎడతెగని నీ శోకానికి మందు!' కవితలో భావ స్ఫూర్తితో వర్ణించడంపై కవితలోని వర్ణనాత్మక శిల్పం. విప్లవ స్పృహతో ధ్వనింపచేసినట్లైనది. గంభీరంగా ప్రతీకాత్మకంగా ఉన్నాయి. వరలక్ష్మి అనువాదం చేసిన మరొక కవిత 'మందిరాల్లో ఉండదు ప్రేమ'అన్న కవితలో "దుఃఖితులారా నా మాట వినండి/ ప్రేమలోకం ఆకృతి దాల్చేది / దాని కొరకు మీరు చేసే పోరాటం వల్లే" అన్న ఈ మహోపాధ్యాయుని తాత్వికత ఎంత శక్తివంతమైనదో తన జీవితాచరణతో రాజీపడని పోరాటంతో కర్తవ్య నిర్మాణమై సాగడం మన ధర్మం అని తాత్వికంగా తెలియజేస్తూ కవిత దృక్పథం విడమరిచి, విస్తరించి, నమ్ముకున్న విశ్వాసాల నుండి ఆవిర్భవించింది. ప్రళయ కాలవాయు తరంగాల వలె అడ్డగించడానికి అసాధ్యమై ప్రచండ వేగంతో ముందుకు చొచ్చుకొని వచ్చే వేగ విశేషం. వ్యంగ్యార్థ సంబంధ భావస్ఫూర్తి చేత, విశేషణాభావం, ప్రేరణార్థ ప్రయోగభావం స్ఫురిస్తోంది.
కవి ఏం చెప్పాడు అన్నది మూలంలో పరిశీలిస్తే ఆచరణాత్మకమైన ఐక్య పోరాట కార్యాచరణతో విప్లవ పోరాటానికి సంసిద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది అని సందేశాత్మకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చెరబండరాజు వాక్యాలు గుర్తుకొస్తున్నాయి. "మంటను మంటగానే చిత్రించి తృప్తిపడితే, పరిష్కారం చూపని రచనా ధోరణిని కూడా నేటి తెలుగు కవిత్వం వెనక్కి తరిమేసింది. అందుకే విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించి ఊపిరి పీల్చుకుంటోంది".
(చెర: 02-10-1970)
పుస్తకం : ది లివింగ్ కబీర్
పేజీలు : 16 (పదహారు)
వెల : అమూల్యం
ప్రచురణ: విప్లవ రచయితల సంఘం
సమీక్షకులు
మా సత్యం (ఎంఎ సత్యనారాయణరావు)
94940 52775