- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేహం కాదు... దేశ మానం
నగ్నంగా నడిచింది
మహిళ దేహం కాదు.....
అది మన దేశ మానం... అభిమానం
యుగాలు దాటొచ్చిన మనిషిని
మృగాలుగా మార్చింది ఎవ్వడు
పాలిచ్చిన అమ్మల రొమ్ములను
బరి తెగించి ఊరేగించిన ఉన్మాదానికి
ఊతమిచ్చింది ఎవ్వడు
వేట కుక్కల్ని ఉసిగొల్పింది ఎవ్వడు
విద్వేషాన్ని రక్తనాళాల్లోకి
ఎక్కించింది ఎవ్వడు
తల్లుల జననాంగాల మీద తాండవ మాడిన
గాడిద కొడుకులను కని పెంచింది ఎవ్వడు
నెత్తురుని మరిగించింది ఎవ్వడు
కత్తులను నూరించింది ఎవ్వడు
పరమత ఆలయాలను కూల్చింది ఎవ్వడు
ఉసురు తీసి ఉత్సవం చేసింది ఎవ్వడు
మంటలను రాజేసింది ఎవ్వడు
గిరిజన పంటలను కాల్చేసింది ఎవ్వడు
మదమెక్కి ఆడబిడ్డలపై మానభంగం చేసిన
మతోన్మాద మూకలకు నూకలు
ఇస్తున్నది ఎవ్వడు
పాకలు వేసి భక్షణ శిక్షణ
అందిస్తున్నది ఎవ్వడు
ఎవ్వడురా విషాన్ని విరజిమ్ముతున్నది
ద్వేషాన్ని దేశంపై వెదజల్లుతున్నది
మతాన్ని మంటలకు ఇంధనం చేస్తున్నది
పచ్చని గసగసాల పైరు కొండల
మణిపూర్ కన్నుల కుండల నిండా
మరిగే వెచ్చని నీరును నింపుతున్నది
వాడు....! వాడెవడంటే....!!
ఛాందస పీఠంపై పీటలు వేసుకుని
మౌడ్య సిరా చుక్కలను
మౌన కలంలోకి ఒంపుకొని
రణ మరణ శాసనాలు లిఖిస్తున్నాడు.
మన జీవన గమనాలను శాసిస్తున్నాడు.
అయితే..... ! ఇప్పుడు
వాడు అనుకుంటున్నట్టు ...!!
మణిపూర్ నడి వీధుల్లో
నగ్నంగా నడిచింది దేహం కాదు
.... అది దేశం.
పాశవిక అత్యాచారం జరిగింది
మానం మీద కాదు
.... వాడి మౌనం మీద
బండారు రమేష్
ఖమ్మం