కన్నీళ్ల ప్రార్థన

by Ravi |   ( Updated:2024-09-30 01:15:57.0  )
కన్నీళ్ల ప్రార్థన
X

కన్నీళ్లు గుండె నిండుతున్నయ్

భారము దింపలేనంత

మనుషులు కదలలేనంత

ఒక్కసారి బుల్డోజర్ పిడుగు పడ్డది

ఏమి అర్థం కాని వలయంలో

జీవచ్ఛవాల కొట్టుకుంటున్నామ్

సారు, తెలియక తప్పులు చేశాము

పెద్ద మనసు పెట్టుకొని

మా జీవితాలను కూల్చకు సారు

నీ చూపుల కింద కాలం గడిపేటోళ్లం

తెలియక చేసిన జీవితపు తప్పు

నీవే కాయాలి సారూ

ఇక మాకు దిక్కెవ్వరు

ఎవరికి మొరిపెట్టుకుందుము మీకు తప్ప

రాజుకే కోపం వస్తే ఎటు పరుగు తీయ్యము

ఏ రాయిని మొక్కము సారు

అన్నీ నీవే కోటి దండాలయ్య మీకు

మీరు తలుచుకుంటే

ఇట్టే బతికి పోతాం

లేకుంటే అయింత ఆధారం లేక

రోడ్లపైన పడిచస్తం సారు

నీ దయ మాపై చూపు మహాప్రభు

కడుదీన హీన బతుకులు మావి

గుడ్డి కొంగల్లా ప్రభుత్వ భాష

అర్థం కాని పామరులం

నీవే దయవుంచి

మా ఇల్లులను కూల్చకండి సారు

మీకు కోటి దండాలు పెడుతం

కోటి కొబ్బరికాయలు కొడతాం

గుండెల్లి ఇస్తారి

98499 83874

Advertisement

Next Story

Most Viewed