అమరత్వంపై

by Ravi |   ( Updated:2024-10-20 23:45:33.0  )
అమరత్వంపై
X

కరగని చిరు నవ్వు

చెదరని దర హాసం

పట్టు విడవని తత్వం

కానరాని అలసత్వం

తరగని గుండె ధైర్యం

చెక్కు చెదరని విశ్వాసం

స్టీఫెన్ హాకింగ్‌తో పోటీనా

వీల్ చైర్ పైనుండే పోరాటమా

పీడితుల విముక్తే లక్ష్యమా

ఆటవిక న్యాయంపై బాణమా

ఆదివాసులపై మమకారం

కార్పొరేట్లపై ఆగని పోరాటం

నీ దారి తరతరాలకు ఆదర్శం

ప్రపంచ మేధావుల్లో అగ్రస్థానం

సాయిపేరు చరిత్రలో స్వర్ణాక్షరం

పోరుప్రజల గుండెల్లో అజరామరం

- చేతన

Advertisement

Next Story