వెలిగే సూర్యుడు

by Ravi |   ( Updated:2024-10-20 23:30:28.0  )
వెలిగే సూర్యుడు
X

పోరాటం తన నైజం

తనతోనే తాను పోరాటం

తన అంగవైకల్యంతో పోరాటం

అధిగమించాడు ఆచార్యుడయ్యాడు!

విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు

సమాజం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు

మానవ హక్కుల కోసం పోరాటం

తన హక్కులు హరించబడ్డాయి!

స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి

జైల్లో నిర్బంధించబడ్డాడు

పది సంవత్సరాల కారాగారం

నిజం నిదానంగా

నిర్దోషి అని తేలింది

అన్యాయపు నిర్బంధానికి

దోషి ఎవరు? శిక్ష ఏమిటి??

ప్రగతిశీల భావజాలం తప్పా?

హేతువాదం సహేతుకం కాదా?

విధ్వంసాలు లేవు..

విద్రోహ చర్యలు లేవు!

వ్యవస్థలు విఫలమైతే ప్రశ్నిస్తాడు

పీడిత ప్రజల పక్షాన నిలబడుతాడు

ప్రశ్నించడం తప్పా?

సమాధానం ఉంటే చెప్పాలి

లేకుంటే ఒప్పుకోవాలి!

అణచివేత ఎక్కువైతే రగిలిన అగ్గిరవ్వలు

నిలదీసే నిప్పు కణికలయితాయి

సహనాన్ని వదిలి దహనాన్ని

మొదలు పెడతాయి!

వెలుగుతున్న సూర్యుడు

ఆకాశానికి ఎగిరిపోయాడు

అభిమానుల హృదయాలు

పగిలేలా ఒరిగిపోయాడు!

అవిశ్రాంత పోరాటంలో విశ్రాంతి తీసుకున్నాడు!

వీరుడా తిరిగిరావా శత్రువు గుండె మీద

గురిపెట్టిన ఫిరంగి గుండులా!

సాయిబాబా నీకు సలాం

పీడిత ప్రజలకు నీవు బలం

వీరుడా నీకు జోహార్!

జోహార్ జోహార్ వీరుడా!!

జగ్గయ్య. జి

98495 25802

Advertisement

Next Story