మంద దీపాలు

by Ravi |   ( Updated:2024-10-14 00:15:06.0  )
మంద దీపాలు
X

మా పలకల మీద

విజ్ఞానపు అక్షరాలై....

మా కంచాలల్ల

పాల బువ్వల మెతుకులై...

ఇద్దరు అక్కల, చెల్లెండ్ల లగ్గానికీ

సున్నం జాజిపూతల పందిరి గుంజలై...

ఏ కష్టమోచ్చినా, కన్నీళ్ళోచ్చినా...

మాకు వెన్ను దన్నుగా నిలబడి

సమాజంలో మమ్ముల

నిలువెత్తు నిలబెట్టిన ఆత్మగౌరవ గొంగడ్లు.

తరతరాల నుండి తల్లులై

మమ్ముల సాదుకున్న మశమ్మలు,పోశమ్మలు.

మా తనువెళ్ళా

అల్లుకపోయినా ప్రేమ సంబంధాలు

మీ వెంట తిరుగుతున్నందుకు

జీవకారుణ్యభావాలు నూరి పోసి

ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, జ్ఞానవంతులుగా

మానవతా వాదులుగా తీర్చిదిద్దిన విశ్వ విద్యాలయాలు

తల్లులు

అడవిలో పొద్దుమూకినట్లుండే

మా బతుకు తొవ్వల్లో

వెలుగులు నింపిన మంద దీపాలు

పండుగకు, పబ్బానికో

సావుకో, బతుకుకో

మిమ్మల్ని సంపుకున్నం, సాదుకున్నం

మీ చనుబాలు తాగిన బిడ్డలం!

ఎన్ని జన్మలెత్తినా

మీ ఋణం ఎట్ల తీర్చుకోగలం

బండారు బొట్లు పెట్టుకొని

శిరస్సొంచి మీ కాళ్ళను మొక్కుతున్నం!!

మమ్ముల మన్నించుండ్రి, మమ్ముల దీవించుండ్రి.

చిక్కొండ్ర రవి

9502378992

Advertisement

Next Story

Most Viewed