తీపి గుర్తులు

by Ravi |   ( Updated:2024-10-13 23:00:48.0  )
తీపి గుర్తులు
X

జ్ఞాపకాల అలలు

తీపిగుర్తుల కలలు

గుర్తుకొస్తున్నాయి

ఆ రోజులు వేరు

బంధాలు అనుబంధాలు

జీవన తరంగాలలో

ఊయల లూగిన రోజులు

కల్లకపటమెరుగని

మాయ మర్మమెరుగని

అమృతపు ఘడియలు-

ఆ తీపిగుర్తుల జాడలు

అను నిత్యం

వెంటాడుతూనే ఉంటాయి

అవి మరిచిపోని

మధుర క్షణాల

సుమధుర ఘడియలు

మల్లెల సుమ సౌరభాల

మమతాను రాగాలు

వెల్లివిరిసిన

వీడని ముడులు

కొరుప్రోలు హరనాథ్

97035 42598

Advertisement

Next Story

Most Viewed