సైనిక వందనం

by Ravi |
సైనిక వందనం
X

సరిహద్దుల్లో పహారా కాళ్లు పాతి

నిఘా కళ్ల దివిటీలు ఎత్తిపట్టి

అపరిచిత శత్రువుపైన

నిరంతరం గురిపెట్టే నా వీరజవాను ....

భుజాన వేలాడే అతని రైఫిల్కేమి తెలుసు

అందులో లోడ్ చేసినవి అతని కన్నీటి బొట్లని?

ఛాతీని కప్పిన బుల్లెట్ ప్రూఫ్

జాకెట్కేమి తెలుసు ఆ వెనుక

దాగిన గుండె ఛిద్రమవుతోందని?

నియంత్రణరేఖ వద్ద టకటక శబ్దం చేస్తూ

కవాతు చేసే బూట్లకేమి తెలుసు

ఆత్మ 'అవుటాఫ్ కంట్రోల్' అయి

వేసిన ఆ అడుగులపైన పాదాలకు తీపి లేదని?

సరిహద్దుల్లో నమ్మకాలు

విభజన రేఖలాగే

నిలువునా చీలుతుంటాయి.

నాలుగ్గోడల నడుమ

శాసనాలు, ఒడంబడికలు

పాచికలై పొర్లుతుంటాయ్,

పణంగా సిపాయి ఊపిరి

నెత్తుటి సంతకమవుతుంది.

పత్రికల్లో తూటాలు

మొక్కుబడిగా పేలుతాయి

సొంత గూటిలో గుండెలు

వపేటికల్లో విచ్చుకుంటాయి

జెండాల నీడన తెల్లపావురాలు

ఎప్పటిలాగే అమాయకంగా ఎగురుతుంటాయి.

ఎన్ని ఛానెళ్ళు ఈదుకుంటూ పోయినా

కనిపించదేం? నిజమైన హీరో త్యాగం....

సినిమా హీరోగారి పుట్టిన రోజు మాత్రం

ఓ ఛానెల్లో ప్రత్యేక కార్యక్రమం

అక్కడ బోర్డర్లో బంకర్ దగ్గర

మట్టిలో పాక్కుంటూ, దేక్కుంటూ పోరాడిన

నా వీరజవాను రక్తం చిప్పిల్లదేం

ఏ టీవీ స్క్రీన్ మీదైనా....?

గ్లామర్ దీనికి నెలతప్పిందన్నది.

'బ్రేకింగ్ న్యూస్' మరో ఛానెల్కి.

మట్టిలో కలిసిపోతే నా వీరజవాను

- మల్లారెడ్డి మురళీమోహన్

ఆ ధూళి రేగడం లేదెందుకో

ఏ టెలివిజను స్టూడియోలోనూ?

మూడుసార్లు విడాకులు తీసుకున్న

హాలీవుడ్ ముద్దుగుమ్మ కొత్త ప్రియుడెవరన్నది.

ఇక్కడి లోకల్ ఛానెల్లో ఫోకస్ ఇప్పుడు ....

అదిగో కనిపించాడు నా వీరజవాను ....

ఇక్కడ కూడా స్క్రీన్ అడుగున

సోలింగ్ న్యూస్ గీతల్లో ప్రాకుతూ...డేకుతూ ....

సైనికుడు నేలకొరిగితే.

జెండా 'హాఫ్ మాస్ట్' అయినట్టు

అతని వీర మరణ వార్త కూడా

అడుగున చేరింది... పాకుతూ.. డేకుతూ ...!

మల్లారెడ్డి మురళీ మోహన్

88611 84899

Advertisement

Next Story

Most Viewed