- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత: విముక్తి పయనం!!
అలా మొదలవుతుందో ప్రయాణం
గాలి వాటుగా మాటల మాటుగా
అక్కడక్కడా రాలుతున్న ఆకులను
పూలను గుండెకు హత్తుకుంటూ
ఎండ పొడలో నుదుట చెమట పట్టి
ఉప్పు పేలిన మొఖంపై
రహదారి పక్కన బోరు పంపు నీళ్ళు
చిలకరించుకుంటూ
కాసిన్ని గొంతులో ఒంపుకుంటూ
కదులుతుందో ప్రయాణం
మాటలు కలిపేందుకు ముఖంపై ముడతల
అనుభవపు గీటురాళ్ళతో ఓ మనిషి
నవ్వుతూ నీ భుజం తడుతూ
ఆయాసాన్ని ఆలవోకగా పారదోలుతూ
కబుర్ల కథలలో సాగుతుందలా
తరాలుగా మానని గాయమేదో లోలోపల
దొలుస్తూ పెడుతున్న సలపరం
కనురెప్పల వెనక దాగుతూ
ఆగని పయనం
ఎండిన పాయల మద్యగా నెత్తుటి ధారలా
దాహపు నదీ ప్రవాహం
మండుతున్న ఇసుకలో పాదాలు
కూరుకుపోతున్నా
పద పదమంటూ పయనం
గుట్టలుగా మిగిలిన రాళ్ళ మద్య
చీలమండలు కోసుకుపోయినా
సాగే రాతి ప్రవాహపు ధారగా
అలుపెరుగని పయనం
మండుతున్న అడవి దారులలో
చిటపటమని ఆకుల సవ్వడి మద్య
పెళపెళమని ఆకాశపు హోరులో
సాగుతున్న అప్రకటిత యుద్ధారావం
మీదుగా ఆగిపోని యీ పయనం
ఇదొక అనంత దారుల పాయల
మీదుగా సాగే జీవన ప్రవాహ
విముక్తి పయనం!!
కెక్యూబ్
9493436277
Also Read..
- Tags
- poem