- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గల్పిక
మా అమ్మ ఈమధ్య తెల్లారే ముందు కలలోకి వచ్చింది 'అరేయ్ ఏం చేస్తున్నావ్ రా తెల్లారి పాయలు నిద్ర ఎట్లా పడుతుంది రా నేను ఒక్కసారి లేచి కిటికీలోంచి చూశాను మా అమ్మ సుశీలమ్మ పిలిచినట్టు విన వినబడింది
ఇంకా తెల్లారినాక నిద్ర వస్తుందారా పోడా రాత్రి తెల్లం దాకా చదువుతున్నావురా ఇంకా తెలివిగల మొఖాలు నీ చిన్న చిలుక మనుమరాలు కనబడుతలేదు ఏందిరా అడిగింది
ఏందే నీ యవ్వ పొద్దుందాక కోడలితో కొలుపు తెల్లారిందో లేదో నాతో కొలుపు చలికాలం నిద్రపోరాదే పోరాదే జరసేపు
సరే అమ్మ అక్కడ దేవలోకం ఎట్లుంది మంచిగున్నావా తిన్నావా లేదా ఇంకా' యోగక్షేమాలు అడిగాను అంతే ఇక చూడు మా అమ్మ నా మీదికి ఒక్కసారి గయ్యిన లేచింది
ఏం దేవ లోకం రా ఏం పాపం చేసుకున్నారా దేవుని గుల్లే మన్నువడ ఏం దుష్ట రాత అడుక్కొచుకున్నానురా ఎప్పుడు చూసినా గవ్వే మొకాలు ఎటు చూసినా గాల్లే అటు తిరుగుడు ఇటు తిరుగుడు ఓ పగలు లేదు సందె యాల్ల కసువు ఊడిచింది లేదు చెత్త పార పోసింది సింది లేదు పొద్దుగాల లేదు రాత్రి లేదు కంటి నిండా పన్నది లేదు కడుపు నిండా తిన్నది లేదు ఓ ఆయి లేదు బాయి లేదు అయితారం లేదు శుక్రవారం రాదు కడప పూజిచ్చుడు లేదు వాగిట్ల ముగ్గు వేసింది లేదు.ఏం బతుకు బతుకు పాడిన గిట్లుంటదని తెలిస్తే అక్కడనే మన ఇంట్లో ఉంట తెలువక వచ్చిన యాకాశి మరణమని ఈత కొయ్యల్ల ఉల్లిగడ్డ శాస్త్రవేరారా ఉల్లిగడ్డ శాస్త్రం అయినారని రాతలు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ శాస్త్రవేనా పడ్డట్టయిందిరా పగోనికి కూడా గీ బతుకు రావద్దు రా
అగో అమ్మా పోయి ఎన్నొద్దులైందే గంతగనం లావు లావు యాష్ట పడవడితివి ఇక్కడ ఉంటే అట్లా అక్కడ ఉంటే ఇట్లా
ఏందో ఏమో నీ కథ నాకు తెలువది మంచిగా దొరసాని లెక్క కాల్ మీ కాల్ మీదే మీదేసుకొని బతుకక. అరేయ్ నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితలేదు నువ్వు వచ్చి దోల్కపోతావా లేదా నన్నే రమ్మంటావా ఇదేనారా తల్లి అంటే ఉంటే ఇడుసేది లేదు పోతే తలిసేది లేదు ఉల్లిగడ్డ శాస్త్రవేనా రా నీ కథ అంతా
ఏమని చెప్పు రా నువ్వు గీ నరకమే మంచిగుంది ఓ అచ్చట ముచ్చట తీరుతుంది పుట్టుకలు చావులు ఏడ్పులు ఆర్పులు పెళ్ళాం మొగలు మనము కొడుకులు కోడండ్లు బిడ్డలు అల్లుళ్ళు ఏ ఏమన్న చెప్పు రా ఇదే మంచిగుంది బౌకష్టమైన బహు కష్టమైన ఇష్టంగా ఉంటదిరా
అవునే అమ్మ ఓట్లు ఉంటాయా నోట్లు ఉంటాయా గక్కడ తాగుడు బుక్కుడు తందనాలు ఉంటాయానే ఒసి పోడా గింతనన్నొ ఉమరస లేదు వారీ నీకు నెరినెరి మీ అయ్య లెక్క పాయిదార్ల గునం నేర్సినావ్
Also Read...
- Tags
- galpika