- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతరంగం: కంకి ధర ఐదు.. గింజ ధర వంద!?
బడా బడా సూపర్ మార్కెట్‌లకు పోయినంక అవసరం లేనివి ఎక్కువ తెస్తం. పోంగనే ట్రాలీ ఇస్తరు. దాని తోసుకుంటూ పోతే బ్రెడ్, బిస్కెట్లు, చాక్లెట్లు ముందే పెడుతరు. మంచి వాసన వస్తయి. టక్క టక్క ట్రాలీలో వేసికొని అంత తిరిగి వస్తాం. మనకు అవసరం ఉన్న వస్తువు ఎక్కడో ఉంటది దాన్ని కొనుక్కొని వస్తం. కిరాణంల ఒక్క సబ్బు అంటే ఇస్తరు సూపర్ మార్కెట్‌లో నాలుగు సబ్బులు కలిపి పాకెట్ చేసి ఆఫర్‌లో అమ్ముతరు. ఇట్లా సులభంగా మన ప్రమేయం లేకుండా మన మనీ ఫోన్ పే ద్వారా వాళ్ల పెట్టెలో పడుతవి. మార్కెట్ మాయాజాలం నిండిపోయి ఉన్నం. ఈ వల నుంచి బయటపడనూ లేం.
చూస్తే పెద్ద పొట్లం. పొట్లం నిండా తెల్లని పువ్వులు పువ్వులుగా కనిపిస్తున్న మక్క ప్యాలాలు. వాటిని పాప్ కార్న్ అంటరు. చూడంగనే తినాలపిస్తది. ధర చూస్తే వంద రూపాయలు. అసలు అండ్ల ఎన్ని గింజలున్నయి. ఒక చిన్న మక్క కంకి ఒలిస్తే అలాంటివి రెండు పొట్లాలు చేయచ్చు. అంటే, పది రూపాయల కంకి గింజలు వందరూపాయలకు అమ్ముడు! ఇదెంత మాయ కదా? అనుకున్న. ఇదంతా ఇటీవల మల్టిప్లెక్స్ థియేటర్‌లో సినిమాకి వెళితే తెలిసింది. ఆ పాప్ కార్న్ పొట్లంలో 30,40 గింజలున్నయి. రైతు దగ్గరనైతే ఐదు, పది రూపాయలకు ఒక కంకి కొంటరు. ఆపైన దానికి పాప్‌కార్న్ సొగసులు యంత్రాలతో అద్ది నూరు రూపాయలు తీసుకోవడం దారుణమే. అవి అమ్మేవాళ్లు సినిమా థియేటర్‌లో గుత్తకు తీసికుంటరు.
వాళ్లు ఇలా అమ్మడం మక్కలతోని వ్యాపారాలు బాగానే ఉంటాయి. సూపర్ మార్కెట్‌లో దొరికే కార్న్ ఫ్లెక్స్ బహుళజాతి కంపెనీలవి కొనుక్కుంటే అవీ ఇంతే. అందులో దోసెడు కూడా ఉండని మక్క గింజల పలకలను రెండు రూపాయలకు పైగా అమ్ముతరు. అందులో కార్న్ ఫ్లెక్స్ కొద్దిగనే ఉంటాయి డబ్బా పెద్దగుంటది. దానికి పెద్ద అడ్వటైజ్‌మెంట్ దాన్ని కొనుక్కొని తింటే కడుపు నిండది. అందులో ప్రాథమికంగా ఉండేది మక్క గింజలే. అదే పంటలు పండిచ్చే రైతుల దగ్గర గింత అగ్గువ అగ్గువకు కొని సూపర్ మార్కెట్‌లో, సినిమా హాలులో ఆధునిక పద్ధతులతో మార్పిడి చేసి ఇంత ఘోరంగా సంపాదిస్తున్నారు. వీటన్నిటి వెనుక మల్టీ నేషనల్ కంపెనీలే ఉంటాయి.
అక్కర లేకున్నా కొనుడే
బిస్కెట్లల్ల ఉండేవి కొంచెం బియ్యం పిండి, కొంచెం చక్కెర, నిలువ ఉంచే రసాయనం, ఇంత మైదా పిండి. అన్నింటి మూలాల మిశ్రమం చూస్తే ఒక పాకెట్‌కు రూపాయి లోపు మాత్రమే తయారీ ధర. కానీ, బిస్కెట్ పాకెట్‌కు రకరకాల పేర్లు పెట్టి 20, 30 రూపాయలకు అమ్ముతరు. ఈ బిస్కెట్లకు, పాప్ కార్న్‌కు, కార్న్ ఫ్లెక్స్ కు పెద్ద సైంటిఫిక్ టెక్నాలజీ ద్వారా కనిపెట్టింది లేదు. అంతా మార్కెట్ మాయాజాలం. మనకు అవసరం లేని దాన్ని వాడు మనలను ఊరిచ్చి కొనిపిచ్చుకుంటడు.
ఎట్లనైనా మన జేబుల ఉన్న పైసా వాని గల్ల నిండాలి. మన దగ్గర పైసలు లేకున్నా కొనిపిచ్చే శక్తి కూడా ఉంటది. క్రెడిట్ కార్డ్‌ల ద్వారా లేదా బ్యాంకు అప్పుల ద్వారా మార్కెట్ లో కార్పొరేట్ శక్తులు తయారు చేసిన వస్తువులు అమ్ముడు పోవడం ముఖ్యం దానికే ఎత్తుగడలు. పైసా విలువ లేనివి పది పైసలకు అమ్ముడు పైగా అక్కర లేకున్నా మన నుంచి కొనిపించే విద్యలు వాళ్లు ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థలలో నేర్చుకుంటరు.
ప్రపంచమంతా ఇంతే
సమాజంలో ఏ వస్తువైనా పెట్టుబడి తక్కువ. కిందిస్థాయి నుంచి తక్కువ ధరకు కొనడం. బ్రాండ్ పేర్లు చేర్చి దానినే తిరిగి అయిదింతలకు అమ్మడం. ఇదంతా మన దగ్గర అనే కాదు ప్రపంచం అంతా ఇట్లనే ఉన్నది. ప్రపంచంలో అగ్రరాజ్యం యుద్ధ విమానాలు తయారు చేస్తది. అగ్రరాజ్యం అంటే ఆ రాజ్యంలో బడా పెట్టుబడిదార్లు. వాటికి కోటాను కోట్ల డాలర్ల రేటు. మరి వాటిని అమ్ముకోవాలంటే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సృష్టించాలి.
అప్పుడు ఆ దేశం మీద గెలవాలంటే ఆ దేశం కంటే ఎక్కువ యుద్ధ తంత్ర సామాగ్రి ఉండాలంటే మా యుద్ధ శకటాలు కొనవలెనని సలహాలు ఇస్తది. వెంటనే యుద్ధ భయం శత్రువును జయించాలనే తలంపుతో అవి కొనుగోలు చేస్తది. ఇట్లనే అమ్ముకోవడం పెట్టుబడులు సమకూర్చుకోవడం చూస్తున్నాం.
చిరు వ్యాపారాలు ధ్వంసం
ప్రపంచీకరణ చిన్న చిన్న నగరాలకూ వచ్చినంక చిన్న చిన్న కిరాణా వ్యాపారాలు కుదేలు అవుతున్నాయి. కిరాణంలకు పోయి అవసరం ఉన్న వస్తువు తెచ్చుకుంటం. కానీ, బడా బడా సూపర్ మార్కెట్‌లకు పోయినంక అవసరం లేనివి ఎక్కువ తెస్తం. పోంగనే ట్రాలీ ఇస్తరు. దాని తోసుకుంటూ పోతే బ్రెడ్, బిస్కెట్లు, చాక్లెట్లు ముందే పెడుతరు. మంచి వాసన వస్తయి. టక్క టక్క ట్రాలీలో వేసికొని అంత తిరిగి వస్తాం. మనకు అవసరం ఉన్న వస్తువు ఎక్కడో ఉంటది దాన్ని కొనుక్కొని వస్తం.
కిరాణంల ఒక్క సబ్బు అంటే ఇస్తరు సూపర్ మార్కెట్‌లో నాలుగు సబ్బులు కలిపి పాకెట్ చేసి ఆఫర్‌లో అమ్ముతరు. ఇట్లా సులభంగా మన ప్రమేయం లేకుండా మన మనీ ఫోన్ పే ద్వారా వాళ్ల పెట్టెలో పడుతవి. మార్కెట్ మాయాజాలం నిండిపోయి ఉన్నం. ఈ వల నుంచి బయటపడనూ లేం.
అన్నవరం దేవేందర్
94407 63479
- Tags
- antarangam