- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా-సంవేదన:బాక్స్పేస్
టైప్ మెషిన్‌లో బ్యాక్ స్పేస్ అన్న పదం ఉంటుంది. చాలా కాలం నుంచి నన్ను వెంటాడుతున్న పదాలు రెండు. ఒకటి బ్యాక్ స్పేస్, రెండవది బియాండ్ వర్డ్స్. వీటిని అనువదించడం అంత సులువు కాదు. కొన్నిసార్లు అనువాదాలు కంటగింపుగా ఉంటాయి. కొన్ని అనువాదం చేయడం కన్నా సృజన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అన్యభాషా పదాలను మరో రకంగా సృష్టించినపుడు చాలా మందికి నచ్చకపోవచ్చు. వాడుకలో ఉంటే అందరూ ఆమోదిస్తారు. ఆనందిస్తారు కూడా. బ్యాక్ స్పేస్‌కు సంబంధించిన చాలా కథనాలు ఇంటర్నెట్‌లో కనిపిస్తాయి. యూట్యూబ్‌లోనూ కనిపిస్తాయి. చాలా ఏళ్ల క్రితం యూట్యూబ్‌లో బ్యాక్ స్పేస్ గురించి ఓ ఒక ఆసక్తికర కథని చూశాను. బ్యాక్ స్పేస్ వలన తలెత్తే అవకతవకల గురించి, పరిణామాల గురించి కళ్లకు కనిపించే విధంగా చెప్పిన కథ.
ఒకరి దగ్గర బ్యాక్ స్పేస్‌లోకి వెళ్లే కాగితం ఉంటుంది. ఏదైనా సంఘటన జరిగిన తర్వాత ఆ కాగితం మీద బ్యాక్ స్పేస్ అని రాస్తే ఐదు నిమిషాల క్రితం వరకు జరిగిన సంఘటనలన్నీ పూర్వ స్థితికిలోకి వస్తాయి. ఆ కాగితం పైన రాసిన అక్షరాలు మాయమవుతాయి. ఆ కాగితాన్ని అతడు ఓ అందమైన కవర్‌లో ప్యాక్ చేసి, ఒక ఫ్లాట్ ముందు పాల పాకెట్ పక్కన పెడతాడు. ఆ ఫ్లాట్‌లో ఓ యువకుడు ఉంటాడు. అతను తలుపు తెరిచి పాల పాకెట్‌తోపాటు కవర్‌ని కూడా తీసుకుంటాడు. లోపలికి వెళ్లి, సిగార్ వెలిగించుకొని, ఆ కవర్ తెరిచి చూస్తాడు.
'కాగితం మీద బ్యాక్ స్పేస్ అని రాసి రాస్తే, ఐదు నిమిషాల ముందు జరిగిన సంఘటన వస్తుంది' అని రాసిన ఓ చిన్న లెటర్ అందులో ఉంటుంది. దానితోపాటూ ఓ తెల్ల కాగితం కూడా ఉంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. అది అబద్ధం అనుకుంటాడు. ఎవరో జోక్ చేసారని అనుకుంటాడు. కాస్సేపటి తరువాత దానిలోని నిజాన్ని తెలుసుకుందామని అనుకుంటాడు. అనుకోవడమే ఆలస్యం, అగ్గిపుల్ల గీసి ఆ రోజటి పేపర్‌ను తగులబెడతాడు. ఆ తరువాత ఆ తెల్ల కాగితం మీద బ్యాక్ స్పేస్ అని రాస్తాడు. వెంటనే దినపత్రిక యథాతథ స్థితిలోకి వస్తుంది. అతడు విభ్రమకి లోనవుతాడు.
ఆ తరువాత ఫ్రిడ్జ్ నుండి ఒక యాపిల్ పండు తీసి దారిలో వెళ్తున్న ఓ వ్యక్తి మీద వేస్తాడు. ఆ వ్యక్తి బాధ కలిగి అరుస్తాడు. ఆ తర్వాత మళ్లీ వచ్చి కాగితం మీద బ్యాక్ స్పేస్ అని రాస్తాడు. వెంటనే యాపిల్ పండు తిరిగి ఫ్రిడ్జ్‌లోకి వెళ్లిపోతుంది. అంటే పూర్వస్థితిలోకి వెళ్లిపోతుంది. ఆ విధంగా రెండు ప్రయోగాలు చేసిన తర్వాత ప్రియురాలిని రమ్మని చెబుతాడు. ఆమెకు ఎప్పుడూ ఇవ్వని బహుమతి ఇస్తానని అంటాడు. ఆమె ఊహించని బహుమతి ఇస్తానంటాడు. ఆమె వస్తుంది. విషయం చెప్పకుండా ఆమెను కత్తితో పొడుస్తాడు. ఆమె అరుస్తుంది. బాధతో మూలుగుతుంది. అతను కాగితం తీసుకొని బ్యాక్ స్పేస్ అని రాద్దామనుకుంటాడు. ఫ్యాను గాలికి ఆ కాగితం ఎగిరిపోతుంది. అది గమనించి అతను కిందకు పరిగెడతాడు. ఆమె పడిపోతుంది. రోడ్లు ఊడ్చేవాడు ఆ కాగితాన్ని దగ్గరలో ఉన్న మంటలో వేస్తాడు .
అది చెత్తలో కాలిపోతూ ఉంటుంది. ప్రేయసి బాధతో, భయంతో కొట్టుకుంటుంది. సగం కాలిన కాగితాన్ని ఆ యువకుడు మంటలో నుంచి లాక్కుంటాడు. భయపడుతూ దాని మీద బ్యాక్ స్పేస్ అని రాస్తాడు. అతని ప్రేయసి తిరిగి యధాస్థితికి వస్తుంది. అతను గదిలోకి పరుగెడతాడు. గదిలోకి రాగానే అతని ప్రేయసి అతని చెంప మీద గట్టిగా కొట్టి వెళ్లిపోతుంది. మళ్లీ అతని ముఖం చూడనని చెబుతూ వెళ్తుంది. టైప్ మెషిన్‌లో బ్యాక్ స్పేస్ ఉంటుంది. కానీ, జీవితంలో ఉండదు. ఉంటే ఇలానే ఉంటుందన్న మరో కాగితపు కవర్ తెల్లవారి పాల పాకెట్ దగ్గర ఉంటుంది.
మంగారి రాజేందర్ జింబో
94404 83001