- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కిక్కే కిక్కు.. నిన్న ఒక్కరోజే కళ్లు చెదిరే రేంజ్‌లో మద్యం అమ్మకాలు
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. వైన్స్ దగ్గర ఎక్కడ చూసినా మందుబాబుల భారీ క్యూ దర్శనమిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తున్నట్లు నిన్న మధ్యాహ్నం ప్రకటించగానే మందుబాబులు అలర్ట్ అయ్యారు. పది రోజులకు సరిపోయే మందు ఒకేసారి కొనుగోలు చేసేందుకు వైన్స్ దగ్గర పడిగాపులు కాశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా వైన్స్ దుకాణాలు కిక్కిరిసిపోయారు. పలుచోట్ల తోపులాటలు కూడా చోటుచేసుకున్నాయి.
లాక్ డౌన్ ప్రకటించిన మూడు గంటల వరకే రూ.56 కోట్లు విలువైన మద్యం డిపోల నుంచి దుకాణాలకు సరఫరా అయ్యింది. ఆ తరువాత పెద్ద మొత్తంలో అమ్మకాలు జరగడంతో సుమారు రూ.125 కోట్ల మద్యం అమ్ముడైంది. అసలే సమ్మర్ కావడం, లాక్ డౌన్ వల్ల మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.24 కోట్లకు పైగా అమ్మకాలు జరగా.. నల్గొండలో రూ.15. 24 కోట్లు, ఖమ్మంలో రూ.12.25 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మే నెల మొదటి 10 రోజుల్లో రూ.676 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించడంతో.. మంగళవారం ఒక్కరోజే రెట్టింపు అమ్మకాలు జరిగాయి.