- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చరిత్ర సృష్టించిన లియోనల్ మెస్సీ
దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక బాలన్ డి ఓర్ అవార్డును రికార్డు స్థాయిలో 7వ సారి గెలుచుకున్నాడు. సోమవారం రాత్రి పారీస్ వేదికగా అట్టహాసంగా జరిగిన వేడుకలో 2021కి సంబంధించిన బాలన్ డి ఓర్ అవార్డును మెస్సీ అందుకున్నాడు. ఇక పోలాండ్ స్ట్రైకర్ రాబర్ట్ లెవాండోస్కీ రెండో స్థానంలో, ఇటాలియన్ మిడ్ ఫీల్డర్ జోరిగిన్హో మూడు స్థానంలో నిలిచారు. ప్రముఖ మ్యాగజైన్ ‘ఫ్రాన్స్ ఫుట్‌బాల్’ 1956లో తొలి సారిగా ఈ అవార్డును ప్రవేశ పెట్టింది. ప్రతీ ఏడాది ఆటలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందిస్తున్నారు.
2010 నుంచి 2015 వరకు ఫిఫా వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బాలెడ్ డి ఓర్‌తో కలిపి ఫిఫా బాలెన్ డి ఓర్‌గా మార్చారు. కానీ 2016 నుంచి రెండు అవార్డులను తిరిగి విడివిడిగా అందిస్తున్నారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ తొలి సారిగా 2009లో ఈ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత 2010, 2011, 2012, 2015, 2019లో మెస్సీనే అవార్డు వరించింది. గత ఏడాది కరోనా కారణంగా అవార్డులను అందించలేదు. తాజాగా రికార్డు స్థాయిలో 7వ సారి మెస్సీ బాలెన్ డి ఓర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. గత సీజన్‌లో బార్సిలోనా తరపున మెస్సీ 48 మ్యాచ్‌లలో 38 గోల్స్ చేశాడు. దీంతో పాటు 28 ఏళ్ల తర్వాత అర్జెంటీనా జట్టుకు కోపా అమెరికా కప్‌ను అందించాడు.
అవార్డు అందుకున్న అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ఈ అవార్డు మరోసారి అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. రెండేళ్ల క్రితమే నాకు ఇదే చివరి అవార్డు అనుకున్నాను. కానీ కోపా అమెరికా టైటిల్ గెలవడం ద్వారా మళ్లీ ఈ అవార్డు లభించిందని భావిస్తున్నాను అని మెస్సీ అన్నాడు. ఇక మహిళల విభాగంలో బాలెన్ డి ఓర్ అవార్డును స్పానిష్ క్రీడాకారిణి, బార్సిలోనా కెప్టెన్ అలెక్సియా పుటెల్లాస్‌కు దక్కింది. బాలెన్ డి ఓర్ అవార్డును అలెక్సియా గెలుచుకోవడం ఇదే తొలి సారి. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన అలెక్సియా మొత్తం 26 గోల్స్ చేసింది.