మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ 24 గేట్లు ఎత్తివేత

by Sridhar Babu |
మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజ్ 24 గేట్లు ఎత్తివేత
X

దిశ, మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజ్ 24 గేట్లును మంగళవారం అధికారులు ఎత్తి వేశారు. నీటి మట్టం 100 మీటర్ల లెవల్‌కు గాను 98.40 మీటర్ల లేవల్లో ఉండగా.. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 16 టీఎంసీలకు గాను ప్రస్తుతం 11,409 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

బ్యారేజ్‌లోకి 60,960 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా బ్యారేజ్ 24 గేట్లు ఎత్తి దిగువకు 60,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న అన్నారం(సరస్వతీ)బ్యారేజ్‌లో 11,900 మీటర్ల లెవల్‌కు గాను 11,752 మీటర్ల లేవల్‌కు నీరు చేరింది. 10.87 టీఎంసీల బ్యారేజి పూర్తి సామర్ధ్యానికి గాను 7.62 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

అయితే బ్యారేజ్‌లోకి పార్వతి బ్యారేజ్ నుంచి 16,740 క్యూసెక్కులు, మానేరు నుంచి 3,751 క్యూసెక్కుల( మొత్తం 20,455) ఇన్ ఫ్లో దిగువకు వచ్చి చేరడంతో అన్నారం(సరస్వతీ) బ్యారేజ్ 7 గేట్లు ఎత్తి 15,750 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులలోకి నీటి ప్రవాహం పెరుగుతున్నందున గోదావరి నదీ తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed