'భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్‌ చెయ్యండి' అని అడగొద్దంటూ జొమాటో ట్వీట్

by Nagaya |   ( Updated:2022-12-23 14:30:41.0  )
భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్‌ చెయ్యండి అని అడగొద్దంటూ జొమాటో ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజలకు అందించే సేవలను ఎప్పటికప్పుడు తెలుసుకుని.. వారి లోపాలను సరిదిద్దుకునేందుకు ఏ సంస్థ అయినా ఆసక్తి చూపుతుంది. అంతేకాకుండా, కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌‌తో సేవల్లో మార్పులు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు అలా తెలుసుకోవాలని ప్రయత్నించిన ఓ సంస్థ కోరికోరి వివాదాలను కొనితెచ్చుకుందనే అనిపిస్తుంది. ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో 'కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌'పేరుతో ఓ కాలమ్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంట్లో యూజర్లు ఫుడ్‌కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేలా జొమాటో తీసుకొచ్చింది. అయితే తాజాగా ఈ కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ విషయంలో జొమాటో తమ కస్టమర్లకు ఓ విజ్ఞప్తి చేసింది.

ఫుడ్ డెలివరీ విషయంలో కస్టమర్లు అదే పనిగా చేస్తోన్న ఓ కామెంట్‌ను దయచేసి ట్వీట్ చేయొద్దంటూ ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. 'భయ్యా.. ఫుడ్‌ను మంచిగా ప్రిపేర్‌ చెయ్యండి'అనే కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ను ట్వీట్ చేయొద్దంటూ గురువారం జొమాటో పేర్కొంది. దీంతో, జొమాటో చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పుడు నెట్టింట నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ట్వీట్‌కు భారీగా నెగిటివ్‌ కామెంట్స్ వస్తున్నాయి. ఇంత మాత్రం దానికి కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్‌ కాలమ్‌ను ఎందుకు ఇచ్చినట్లు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. కస్టమర్ల ఫీడ్ బ్యాక్‌కు అనుగుణంగా ఫుడ్‌ మేకింగ్‌లో మార్పులు తీసుకురావాలి కానీ, కామెంట్‌ చేయకూడదు అని చెప్పడం ఏంటని జొమాటోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed