మీ కనుబొమ్మలను బట్టి మీ క్యారెక్టర్ తెలుసుకోవచ్చు.. ఈ లింక్ ఓపెన్ చేస్తే చాలు

by Jakkula Samataha |
మీ కనుబొమ్మలను బట్టి మీ క్యారెక్టర్ తెలుసుకోవచ్చు.. ఈ లింక్ ఓపెన్ చేస్తే చాలు
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్యశాస్త్రం బట్టి ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది. అతనికి ఎదురయ్యే సమస్యలు, వివాహం, సంతానం ఇలా చాలా విషయాల గురించి తెలుసుకోవచ్చు. అయితే కొంత మంది పండితులు చేతిని చూసి జాతకం చెబితే మరికొంత మంది ముఖాన్ని చూసి కూడా మన జాతకం చెబుతుంటారు.ఇలానే కాకుండా మన ఫేస్‌లో ఉండే కనుబొమ్మల ఆధారంగా కూడా మన ఫ్యూచర్ ఏంటో చెప్పవచ్చు అంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు.

మన ప్రవర్తన, ఆలోచనలను కనుబొమ్మలు తెలియజేస్తాయంట. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

కనుబొమ్మలు అందరికీ ఒకేలా ఉండవు కొంత మందికి మంచి షేప్‌లో దట్టంగా ఉంటాయి. ఇంకొంత మందికి సన్నగా ఉంటాయి. అయితే దట్టంగా కనుబొమ్మలు ఉన్నవారు తమ జీవితాన్ని ఓ నింబంధనల ప్రకారం గడుపుతారంట.మంచిగా మాట్లాడే స్వభావం, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా ఓపెన్ కమ్యూనికేషన్ చేసేందుకు ఇష్టపడుతారంట.

అలాగే సన్నని కనుబొమ్మలు ఉన్నవారు ఎక్కువగా నిశ్శబ్ధంగా ఉండటానికి ఇష్టపడుతారంట.మీకు స్వీయ అవగాహన తక్కువగా ఉంటుంది. కలలు కంటూ ఉంటారు. వీరు ఏదైనా సరే లోతుగా ఆలోచిస్తుంటారంట. అంతే కాకుండా వీరి సిగ్గు చాలా ఎక్కువ. అదేవిధంగా వీరికి పొగితే చాలా ఇష్టమంట. ఇక వీరు ధైర్యం లేకపోయినా ధైర్యంగా కనిపించేందకు ప్రయత్నిస్తారంట.

Advertisement

Next Story