World Press Freedom Day: ‘ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో పత్రికా స్వేచ్చ ఒకటి’

by Jakkula Samataha |
World Press Freedom Day: ‘ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో పత్రికా స్వేచ్చ ఒకటి’
X

దిశ, ఫీచర్స్ : మే3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ప్రజలందరూ జరుపుకుంటారు. దీనిని ప్రపంచ పత్రికా దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గురించి 1991లో మొదటి సారి యునెస్కో సమావేశంలో ప్రతిపాదన రాగా,1993లో ఐక్యరాజ్యసమితి పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని మే3న జరపాలని నిర్ణయించింది. అలా ప్రతి సంవత్సరం మే3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రపంచ స్థాయిలో మీడియా పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. పత్రికా స్వేచ్ఛ పట్ల నిబద్ధత‌ను గౌరవించాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలకు ఈరోజు గుర్తు చేస్తోంది. ఈరోజు ప్రతికా స్వేఛ్చా. మరియు వృత్తిపరమైన నీతి సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది.

పత్రికా స్వేచ్ఛపై చర్చ జరగడానికి, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొనే ఇబ్బందులు ప్రపంచానికి తెలియజేయడానికి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదే విధంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు ఈరోజు నివాళులర్పిస్తారు. ఇక నిజం చెప్పాలంటే,ప్రపంచ పత్రిక దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆఫ్రికా జర్నలిస్టులే అని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పత్రికా స్వేచ్ఛా పాత్ర, జర్నలిస్టులకు ఉండే అపాయాలను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని వీరు భావించి ఈ థీమ్‌ను తీసుకొచ్చారు.

కాగా, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్‌కు సంబంధించిన కొన్ని కోట్స్ చూద్దాం..

మానవ మనస్సు యొక్క స్వేచ్ఛ, స్వేచ్ఛా వాక్ మరియు స్వేచ్ఛా పత్రిక హక్కుల్లో గుర్తించబడినది : కాల్విన్ కూలిడ్జ్

పత్రికా స్వేచ్ఛ అనేది ఏదేశమూ వదులుకోలేని అమూల్యమైన హక్కు : మహాత్మాగాంధీ

ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలలో పత్రికా స్వేచ్చ ఒకటి : నేల్సన్ మండేలా

Advertisement

Next Story

Most Viewed