ఉద్యోగం చేస్తున్న తల్లులకు బిగ్ అలర్ట్.. తమ పిల్లలకు ఇవి నేర్పించాల్సిందేనంట!

by Jakkula Samataha |
ఉద్యోగం చేస్తున్న తల్లులకు బిగ్ అలర్ట్.. తమ పిల్లలకు ఇవి నేర్పించాల్సిందేనంట!
X

దిశ, ఫీచర్స్ : గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆ రోజుల్లో భర్త ఉద్యోగం లేదా వ్యవసాయం, ఇతర పనులకు వెళ్తే భార్య కుటుంబాన్ని, తమ పిల్లలను చూసుకునేది. కానీ ఇప్పుడు భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగం చేస్తూ చాలా బిజీ అయిపోయింది.

ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా ఏ ఉద్యోగం అయినా సరే ఏ రంగంలోనైనా సరే మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అటు కుటుంబం, పిల్లల బాధ్యత చూసుకుంటూనే, ఇటు ఉద్యోగం కూడా చేస్తున్నారు. అయితే పెళ్లి తర్వాత ఉద్యోగం అనేది ఎక్కువ ఇబ్బంది అనిపించదు కానీ, పిల్లలు పుట్టాక వారిని చూసుకుంటూ జాబ్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పని. పేరెంట్స్ సపోర్ట్ ఉంటే కాస్త ఇబ్బంది ఏమి ఉండదు కానీ, వారి సపోర్ట్ లేకుండా అటు తల్లిగా, ఇటు ఓ ఉద్యోగిగా భాద్యతలు నిర్వహించడం కష్టమైన పని. కానీ వాటన్నింటిని కూడా లెక్కచేయకుండా ఈ రోజుల్లో మహిళలు తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటు ఉద్యోగినిగా, అటు తల్లిగా బాధ్యతలు నిర్వహించడం లో సక్సెస్ అవుతున్నారు.

అయితే ఈ క్రమంలో తల్లులు కొన్ని విషయాల్లో అశ్రద్ధ చేయొద్దు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తమ పిల్లలకు ఎలాంటి విషయాలు నేర్పించాలి. వారి బంగారు భవిష్యత్తు కోసం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో తెలుసుకోవాలి అంట. ముఖ్యంగా పిల్లలకు కొన్ని విషయాలు నేర్పించాలి అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఉదయాన్నే లేవడం : చాలా మంది పిల్లలు త్వరగా నిద్రలేవరు. స్కూల్ టైమ్ అయిపోతున్నా, వారు పడుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే వారికి ఖచ్చితమైన టైమ్ సెట్ చేసి వారంతట వారే అదే టైమ్‌కి లేచేలా వారిని ప్రిపేర్ చేయాలి. దాని వలన వారు సక్రమంగా పెరుగుతారు.

సరైన నిర్ణయం తీసుకోవడం : వర్కింగ్ ఉమెన్స్ తమ పిల్లలకు కొన్ని విషయాల్లో నైపుణ్యాన్ని పెంపొందించాలి. కొన్ని కొన్ని విషయాలను వారే స్వయంగా పరిష్కరించుకునేలా ప్రోత్సహించాలి. ఎదుటి వారి సహాయాన్ని కోరకుండా తనకు తానుగా అన్ని పనులు నేర్చుకోవడం, సమయానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేలా మీ పిల్లలను తయారు చేయాలి.

టైమ్ టేబుల్ మెయింటైన్ చేయడం : పిల్లలకు మొదటి నుంచే సమయ పాలన పాటించేలా చేయాలి. లేచింది మొదలు వారు సాయంత్రం వరకు ఏం చేయాలి అనేది వారు ఫిక్స్ చేసుకోవాలి. ఎంత సేపు ఆడుకోవాలి,ఎంత సేపు చదువుకోవాలి అనే నిర్ణయాలను వారే నిర్ణియించుకునేలా వారిని ప్రోత్సహించాలి.

వారితో మనసు విప్పి మాట్లాడటం : ఆఫీసు గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి, ఇంటికి వచ్చాక మీ పిల్లలతో మీరు కాసేపు మనసు విప్పి మాట్లాడాలి. వారు ఆనందంగా ఉన్న క్షణాలు, బాధపడిన క్షణాల గురించి అడిగి తెలుసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించడం లేదా ధైర్యం చెప్పడం చేయాలి.

ఆఫీస్ నుంచి వచ్చాక, వారితో సరదాగా గడపడం : కొంత మంది ఉద్యోగంలోని స్ట్రెస్ వల్ల పిల్లలను ఎక్కువగా పట్టించుకోరు, కానీ వారితో ఆఫీస్ నుంచి వచ్చాక సరదాగా గడపాలి. దాని వలన వారు ఆనందంగా ఉంటారు.

సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించడం : చాలా వరకు తమ పిల్లల డ్రెస్సింగ్ నుంచి ప్రతి విషయంలో పేరెంట్స్ నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అలా చేయకూడదంట. వారు సొంత నిర్ణయాలు తీసుకునేలా తల్లిదండ్రులు చేయాలి అంటున్నారు నిపుణులు. దుస్తులు ఎంచుకోవడం, వారాంతపు కార్యకలాపాలను నిర్ణయించడం, స్నేహితులకు బహుమతులు కొనడం వంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడం నేర్పాలంట.

Advertisement

Next Story

Most Viewed