- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నయా ట్రెండ్ సృష్టిస్తున్న మహిళలు.. దాని సైజ్ తగ్గించుకునేందుకు సర్జరీలు..
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు అందం కోసం ఎంతో డబ్బును ఖర్చుచేస్తుంటారు. పార్లర్లకి వెళుతూ ఫేషియల్స్ చేసుకుంటూ, మేకప్ లు వేసుకుంటూ, వివిధ రకాల ప్రాడక్ట్ లను వాడుతూ ఉంటారు. అంతే కాదు తమ శరీరంలో ఏదైనా పార్ట్ వారు అనుకున్నట్టుగా లేకపోతే సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటుంటారు. వారికి నచ్చినట్టుగా శరీరాకృతి మార్చుకునేందుకు మెడిసిన్స్ వాడటం, బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకునేందుకు ఇష్టపడతారు. ఈ పిచ్చి పీక్స్ కి చేరి అవయవాలకు కూడా సర్జరీలు చేయించుకుని వారికి నచ్చినట్టుగా తయారవుతున్నారు. అందులో ఒక సర్జరీ బ్రెస్ట్ సర్జరీ. గతంలో చాలామంది నటీమణులు, మహిళలు రొమ్ములు పెరిగేందుకు సర్జరీలు చేయించుకునేవారు.
ప్రస్తుతం కాలం మారింది, పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉన్నవారు శస్త్రచికిత్స చేయించుకుని రొమ్ముల సైజ్ ని తగ్గించుకునేందుకు చూస్తున్నారు. ఇలాంటి మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. 2019 నుండి ప్రస్తుతం వరకు వీరి శాతం వంద శాతం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఉద్యోగాలు చేసే స్త్రీలు ఇలాంటి ఆపరేషన్లు ఎక్కువగా చేయించుకునేందుకు మొగ్గుచూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అందానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, ఫ్రీడమ్, విదేశీ సంస్కృతి ఈ చికిత్సలు చేయించుకునేందుకు ప్రోత్సహిస్తున్నాయి. అలాగే బ్రెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్న మహిళలను కొంతమంది బాడీషేమింగ్ చేయడం, వారి వైపునకు వెకిలి చూపులు చూడటం, హేళన చేయడం వంటి సంఘటనలు కూడా బ్రెస్ట్ రిడక్షన్ ఆపరేషన్లు పెరిగేందుకు కారణం అంటున్నారు.
అలాగే ధరించే దుస్తులు కంఫర్ట్ లేకపోవడం అంటే చీరలు, కుర్తాలు ధరించడం మానేసి షర్ట్, టీ షర్టులు, టాప్ లాంటి టైట్ దుస్తులు ధరించినప్పుడు బ్రెస్ట్ సైజ్ పెద్దగా ఉండడం వలన భుజం, మెడ, మరికొన్ని ప్రాంతాలు నొప్పికి గురవుతాయి. ఇది కూడా బ్రెస్ట్ సైజ్ తగ్గించుకునేందుకు ఒక కారణమంటున్నారు.