- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎక్కువగా దగ్గి అలసిపోతున్నారా.. అయితే ఇలా చేయండి..
దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు జలుబు, దగ్గు కారణంగా గొంతులో కఫం పేరుకుపోయి ఇబ్బందిని కలిగిస్తుంది. కఫం సమస్య ఎక్కువ కాలం అలాగే ఉంటే శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్లేష్మ పొర శ్వాసకోశ వ్యవస్థను రక్షిస్తూ కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పొర నోరు, ముక్కు, సైనస్, గొంతు, ఊపిరితిత్తులలో ఉంటుంది. గొంతులో కఫం అత్యధికంగా పెరగడం వల్ల దగ్గు వస్తుంది. రాత్రి సమయాల్లో కఫం ఎక్కువగా పెరుగుతుంది. దీన్ని నివారించడానికి ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
తగినంత నీరు తాగడం..
మీ గొంతులో పెరిగిన కఫం నుంచి మీకు త్వరగా ఉపశమనం కలగాలంటే రోజూ తగినంత నీరు తాగాలి. గొంతులో కఫం వస్తే శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. తగినంత నీరు తాగడం వల్ల గొంతులోని కఫం పలచబడి తేలికగా బయటకు వస్తుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం. మహిళలు 2.7 లీటర్లు అలాగే పురుషులు 3.5 లీటర్ల నీరు తాగాలి.
ఆవిరి పట్టడం
గొంతులో కఫం పెరిగినప్పుడు ఆవిరి పడితే ప్రయోజనకరంగా ఉంటుంది. దీని వల్ల కఫం బయటకు వచ్చి శ్వాస కూడా తేలికవుతుంది. ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తులలో పేరుకుపోయిన కఫం సులభంగా తొలగిపోతుంది.
యోగా చేయడం
శ్వాసకోశ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది.