మీకు ఎప్పుడూ చలిగా ఉంటుందా? కారణం ఇదే కావచ్చు..

by Sujitha Rachapalli |
మీకు ఎప్పుడూ చలిగా ఉంటుందా? కారణం ఇదే కావచ్చు..
X

దిశ, ఫీచర్స్ : మిగతా అందరూ కంఫర్టబుల్‌గా ఉన్నా.. మీకు శరీరంలో వణుకు వచ్చినట్లు అనిపిస్తుందా? వెచ్చని వాతావరణంలో కూడా చలిగా ఉన్న అనుభూతి కలుగుతుందా?ఇతరులు హాయిగా నైట్‌ డ్రెస్‌లోనే పడుకుంటే మీరు మాత్రం స్వెటర్, దుప్పటి కోసం వెతుకుతున్నారా? ఇలాంటి లక్షణాలు ఎందుకు కలుగుతాయి? ఎప్పుడూ చలిగా ఉండేందుకు కారణాలేంటి? చూద్దాం.

రక్త ప్రసరణ సరిగా లేకపోవడం

శరీరంలో రక్త ప్రవాహం సరిగ్గా ఉంటే మీకు వెచ్చగానే ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదంటే.. చేతులు, కాళ్లలో చల్లగా అనిపిస్తుంది. రేనాడ్స్ వ్యాధి లేదా అంతర్లీన గుండె సమస్యల కారణంగా ఇలా జరుగుతుంది. బాడీ టెంపరేచర్ కంట్రోలింగ్‌ కష్టతరం అవుతుంది. ఒకే స్థితిలో ఎక్కువసేపు కూర్చోవడం కూడా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మీ అవయవాలను చల్లగా చేస్తుంది.

రక్తహీనత

రక్తంలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లడానికి ఐరన్ ముఖ్యమైనది. 1996లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ఐరన్ లోపం ఉన్నవారు, రక్తహీనత కలిగిన వారు చలి సమయంలో తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేరు. శరీరం తగినంత వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడానికి కష్టపడుతుంది. ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నప్పటికీ మీకు చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలసట, తల తిరగడం, సున్నితమైన చర్మం వంటి లక్షణాలు ఈ పరిస్థితితో పాటు వస్తాయి. పాలకూర, కాయధాన్యాలు, మాంసం వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం సహాయపడుతుంది.

థైరాయిడ్ సమస్యలు

థైరాయిడ్ మెడలోని ఒక చిన్న గ్రంథి. కాగా జీవక్రియ, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఇది చురుగ్గా లేకపోతే శరీరం తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఎప్పుడూ చలిగా ఉన్నట్లు అనిపిస్తుంది. పొడి చర్మం, బరువు పెరగడం, బద్ధకం ఇతర లక్షణాలు. కాగా సాధారణ రక్త పరీక్ష ద్వారా థైరాయిడ్ స్థాయిలను చెక్ చేయవచ్చు.

తగినంత ఫ్యాట్ లేకపోవడం

కొవ్వు ఇన్సులేషన్‌గా పనిచేస్తుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఒక అధ్యయనం ప్రకారం, లావుగా ఉన్నవారు తక్కువ వణుకుతారు. చలికి గురైనప్పుడు సన్నగా ఉన్నవారి కంటే శరీర ఉష్ణోగ్రతలో చిన్న తగ్గుదలని అనుభవిస్తారు. మీ శరీరంలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటే.. త్వరగా వేడిని కోల్పోతుంది, దీని వలన వెచ్చగా ఉండటం కష్టమవుతుంది. బరువు తక్కువగా ఉన్నవారు లేదా చాలా పరిమితమైన ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు ఇతరులకన్నా చల్లగా అనిపించవచ్చు. తగినంత ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.

డీహైడ్రేషన్

మీరు దానిని గ్రహించకపోవచ్చు.. కానీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. రక్త ప్రసరణ నిర్వహించడానికి నీరు సహాయపడుతుంది. మీరు డీహైడ్రేషన్‌కు గురైతే.. మీ శరీరం తగినంత వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడానికి ఇబ్బంది పడవచ్చు. చల్లగా అనిపించవచ్చు. రోజంతా తగినంత నీరు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితిని నివారించవచ్చు.

నిద్ర లేకపోవడం

నిద్రపోతున్నప్పుడు శరీరం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. నియంత్రిస్తుంది. పేలవమైన నిద్ర లేదా విశ్రాంతి లేకపోవడం జీవక్రియను నెమ్మదిస్తుంది. శరీరం వెచ్చదనాన్ని కొనసాగించడం కష్టతరం చేస్తుంది. దీర్ఘకాలిక నిద్ర లేమి హార్మోన్ల సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది స్థిరమైన చలికి దారితీస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు ప్రతి రాత్రి కనీసం 7-9 గంటల నాణ్యమైన నిద్ర అవసరం.

Next Story