- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దైవ దర్శనం అయ్యాక గుడి ఆవరణలో ఎందుకు కూర్చుంటారు..? టైం వేస్ట్ అనుకుంటున్నారా..?
దిశ,వెబ్‌డెస్క్ : ఆలయానికి వెళ్లి పూజలు చేయడం, దేవున్ని దర్శించుకోవడం చాలామందికి అలవాటే. కానీ కొంతమంది భక్తులు దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోనే కాసేపు కూర్చుంటారు. ప్రసాదాలను కూడా అక్కడే ఆరగిస్తారు. అయితే స్వామి దర్శనమూ, శఠగోపం అయ్యాక కాసేపు దేవాలయములో కూర్చొవాలని పెద్దలు చెబుతుంటారు. అలా ఎందుకు కూర్చోవాలి..? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.
గుడిలో దేవుని దర్శనం అయ్యాక మనస్సు, శరీరం ఉత్తేజితం అవుతుంది. గుడిలో దేవుని మహిమ, మంత్రాలే కాకుండా ప్రత్యేకమైన ఆలయ నిర్మాణ శైలి కూడా మనస్సును ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడుతుంది. గుడి ప్రదేశాల్లో విద్యుత్, అయస్కాంత శక్తి క్షేత్రాల తరంగాల పరిధి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పాజిటివ్ శక్తి విరివిరిగా లభ్యం అయ్యే ప్రదేశల్లోనే దేవాలయాలను నిర్మిస్తారు. ఈ ప్రదేశ కేంద్ర స్థానంలో మూల విరాట్‌ను ప్రతిష్ట చేస్తారు. ఈ ప్రదేశాన్ని మూల స్థానం అంటారు. ఈ మూల స్థానంలో భూమి అయస్కాంత తరంగాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే దర్శనం తర్వాత ఆలయంలో కూర్చుంటే చిరాకులు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. చెడు ఆలోచనలు తొలగి.. మంచి మార్గంలో పయణించడానికి దోహదపడుతుంది.