మనం ఒక్కోసారి ఏం ఆలోచిస్తున్నామో మరిచిపోతాం.. అసలు ఎందుకిలా జరుగుతుంది?

by Sujitha Rachapalli |
మనం ఒక్కోసారి ఏం ఆలోచిస్తున్నామో మరిచిపోతాం.. అసలు ఎందుకిలా జరుగుతుంది?
X

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి బయట నిల్చుని ఓ పని చేయాలని గదిలోకి వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళేసరికి మరిచిపోతాం. మెదడుకు ఎంత పదునుపెట్టినా కాసేపటి వరకు గుర్తురాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఎందుకు మరిచిపోతామో వివరిస్తున్నారు నిపుణులు. అవి ఎలా గుర్తుకువస్తాయి కూడా చెప్తున్నారు.

జ్ఞాపక శక్తి అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అయితే ఇంకోటి వర్కింగ్ మెమరీ. దీర్ఘకాల జ్ఞాపకాలు అంటే మెదడులో ఎక్కువ కాలం నిల్వ చేయబడే జ్ఞానం, అనుభవాలు, నైపుణ్యాల గురించిన విస్తృత సమాచారం కలిగి ఉంటుంది. అంటే గంటల నుంచి జీవితకాలం వరకు అన్నమాట. అదే వర్కింగ్ మెమరీ విషయానికి వస్తే ఒక్కసారి నిమిషాలు లేదా సెకన్లు మాత్రమే బ్రెయిన్ లో ఉంటాయి. వర్కింగ్ మెమరీ ద్వారా కొత్త సమాచారం, అంతర్గత సంభాషణ, ఇంద్రియ ఇన్‌పుట్ మార్గాలు మనం ఆ ఆలోచనలను ఎందుకు మరచిపోతామో వివరిస్తాయి.

ముందుగా వర్కింగ్ మెమరీ చాలా పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అక్షరాలు, అంకెలు, పదాలు లేదా పదబంధాలు వంటి నాలుగు నుంచి ఏడు భాగాల సమాచారాన్ని మాత్రమే కలిగి ఉండగలదని అంచనా వేస్తున్నారు. ఈ భాగాలన్నింటినీ ఏకకాలంలో తెలుసుకోవడం కంటే.. మెదడు ఒక ఆలోచన నుండి మరొకదానికి బౌన్స్ అవుతుంది. దీని వలన షఫుల్‌లో ఒక ఆలోచన తప్పిపోయే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే కొత్త సమాచారానికి చోటు కల్పించడానికి బ్రెయిన్ వర్కింగ్ మెమరీ నుంచి ఇంపార్టెంట్ అనిపించని విషయాలను త్వరగా తొలగిస్తుంది.

మెదడుకు మల్టీ టాస్క్ సామర్థ్యం లేనందునా.. విభిన్న ఆలోచనలు చుట్టు ముట్టినప్పుడు జగుల్ చేయాల్సి వస్తుంది. దీనికి స్పృహతో కూడిన కృషి, శ్రద్ధ అవసరం. కాగా ఇది కాంప్లెక్స్ లర్నింగ్, నిర్ణయం తీసుకోవడం, కారణాలపై వర్క్ చేసే మెదడు యొక్క ప్రిఫ్రంటల్ కార్టెక్స్ ద్వారా పర్యవేక్షించబడుతుంది. కాగా మన దృష్టి ఆ ఆలోచనలలో ఒకదానిపై మాత్రమే కేంద్రీకరించబడితే లేదా కొత్త చోటికి మళ్లించబడితే, మెదడు మునుపటి ఆలోచనలను కోల్పోతుంది. అందుకే మనం ఒక్కోసారి మరిచిపోతుంటామని తెలిపారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed