హోటల్‌లో స్టే చేస్తే 12 గంటలలోపే ఎందుకు చెక్ అవుట్ చేయాలి..? కారణం ఏంటో తెలుసా..

by Sumithra |
హోటల్‌లో స్టే చేస్తే 12 గంటలలోపే ఎందుకు చెక్ అవుట్ చేయాలి..? కారణం ఏంటో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్న వెంటనే మనం చేసే మొదటి పని ఆ ప్రదేశంలో బస చేసేందుకు హోటల్ గదిని బుక్ చేసుకోవడం. దీంతో పాటు ఆ హోటల్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా అని చూస్తాం. హోటల్ ఖరీదైన, చవకైనదైనా సరే, మనం ఎప్పుడైనా చెక్ ఇన్ చేయవచ్చు. కానీ చెక్‌అవుట్‌ మాత్రం మరుసటి రోజు మధ్యానం 12 గంటలలోపే ఎందుకు చేయాలి అనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. పూర్తి 24 గంటల పాటు గదిలో ఉన్నా లేకపోయినా డబ్బులు మాత్రం చెల్లించాల్సిందే. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

హోటల్‌ సిబ్బంది ఇచ్చే వివరాల ప్రకారం చెక్ అవుట్ సమయం మారితే గది శుభ్రపరిచే సమస్య ఉండవచ్చు. ఎందుకంటే 12 గంటల సమయం అంటే కస్టమర్ లేచి సులభంగా గది నుంచి బయటకు వెళ్లే సమయం. ఒక వేళ రూంలో ఉండే డేస్ ఎక్స్టెండ్ చేసినా మధ్యాహ్నం 12 తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పుడు అదే రూం శుభ్రపరిచి ఇస్తుంటారు.

ఏదైనా పని చేయడానికి ఒక నియమాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందుకే చాలా హోటళ్లలో చెక్ అవుట్ సమయం 12 గంటలకు పెడతారు. సమయానికి శుభ్రపరచడం వల్ల హోటల్ నిర్వహణ బాగుంటుంది. కస్టమర్‌లు వేర్వేరు సమయాల్లో చెక్ అవుట్ చేస్తే నిర్వహణకోసం మరింత మంది ఉద్యోగులను నియమించుకోవలసి ఉంటుంది. టూర్ కి వెళ్ళిన తర్వాత పొద్దున్నే నిద్ర లేవడానికి ఏ కస్టమర్ ఇష్టపడరు. అందుకే ప్రయాణికుల సౌకర్యార్థం చెక్‌అవుట్‌ సమయాన్ని 12 గంటలు పెడతారట. ఈ సమయానికి కస్టమర్లు హాయిగా లేచి, మీ వస్తువులను సర్దుకుని సులభంగా బయలుదేరవచ్చు.

Advertisement

Next Story

Most Viewed