వామ్మో.. ఈ రోబో తెలివి మామూలుగా లేదుగా.. ఫాస్ట్‌ ఫుడ్‌‌ను ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తున్నదో మీరే చూడండి.. (వీడియో)

by Javid Pasha |
వామ్మో.. ఈ రోబో తెలివి మామూలుగా లేదుగా.. ఫాస్ట్‌ ఫుడ్‌‌ను ఎంత ఈజీగా ప్రిపేర్ చేస్తున్నదో మీరే చూడండి.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్ : ఆధునిక సాంకేతి పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సమజాంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అనేక సందర్భాల్లో అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయా సేవలను పొందడంలో, అందించడంలో, శాస్త్రీయ పరిశోధనా రంగాల్లో మానవ ప్రమేయానికి మరో ముఖ్యమైన తోడు దొరికినట్లయింది. ఇప్పటికే హ్యూమనాయిడ్ రోబోలను ఆయా సెక్టార్లలో వినియోగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలకు పాఠాలు బోధించే రోబో టీచర్లు కూడా అందుబాటులోకి వచ్చారు.

ఇప్పటికే అనేక హోటళ్లలో రోబోటిక్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆయా కంపెనీల్లో లీగల్ ఇష్యూస్ చూసే వ్యక్తుల స్థానంలో రోబోలు దర్శనమిస్తున్నాయి. వైద్య రంగంలో అయితే రోబోటిక్ శస్త్రచికిత్సలు ఫేమస్ అయిపోయాయి. ట్రాఫిక్ కంట్రోలింగ్‌లో వ్యవస్థలోనూ వీటి వినియోగం పెరిగింది. మానవులు తమ శృంగార కోరికలు తీర్చుకోవడంలోనూ ఇవి కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అన్ని రంగాల్లో అవసరమైన సేవల వినియోగానికి అనుగుణంగా రోబోలు రూపొందుతున్నాయి.

ఇండ్లల్లో వివిధ వస్తువులను అందించడం, ఇల్లు సర్దడం, కడగడం, క్లీన్ చేయడం, ఆఫీసుల్లో ఫైల్స్ చక్కబెట్టడం, వ్యవసాయం చేయడం వంటి రోబోటిక్ సేవలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుండం మనకు తెలిసిందే. తాజాగా మరో రోబోటిక్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇందులో సదరు రోబో వంటగదిలో ఫాస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తోంది. స్టౌ మీద కడాయి పెట్టి, అందులో వివిధ పదార్థాలు వేసి, అచ్చం మార్కెట్లో నూడుల్స్ తయారు చేసే వ్యక్తిలాగే ప్రవర్తించింది. చేతిలో గరిటె పట్టుకొని, కడాయిలోని పదార్థాన్ని కలుపుతూ, దానిని కదుపుతూ, అటూ ఇటూ తిప్పుతూ అచ్చం మనిషిలాగే ఫ్రైడ్ ఫుడ్ ప్రిపేర్ చేసి, పక్కనే ఉన్న గిన్నెలోకి వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed