- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆమె చెవిలో దూరిన పీత.. తర్వాత ఏమయ్యిందంటే..?! (వీడియో)

దిశ, వెబ్‌డెస్క్ః కొన్ని సందర్భాలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. నరాలన్నీ షేక్ అయ్యి షాక్‌లో పడిపోతారు. అది మనకే జరిగిందేమో అన్నంత లెవల్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఈ వైరల్ వీడియో కూడా అలాంటి భావనే కలిగిస్తుంది. నెట్టింట్లో వేలాది మంది వీక్షకులను భయభ్రాంతులకు గురిచేసింది. '@wesdaisy' టిక్‌టాక్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో డైసీ వెస్ అనే ఓ మహిళ చెవిలో దూరిన పీతను తీస్తుంటారు. సడన్‌గా బయటకొచ్చిన పీత మనపై దూకినట్లు ఉంటుంది. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్‌లో ఓ మహిళి స్నార్కెలింగ్ చేస్తున్నప్పుడు చిన్న పీత ఆమె చెవిలోకి ప్రవేశించగా, ఆమె ఫ్రెండ్ దానిని బయటకు తీసే వీడియోనే ఇది. ఈ వీడియోను మిలయన్ల కొద్దీ చూడగా పోస్టు కామెంట్లతో నిండిపోయింది. అయితే, ఈ అనుభవం తనను పూర్తిగా వాటర్ స్పోర్ట్స్ నుండి దూరం చేయలేదని ఆ తర్వాత డైసీ వెస్ వెల్లడించింది. మరుసటి రోజే కయాకింగ్‌కు వెళ్లి, స్నార్కెల్లింగ్ చేసింది. అయితే, స్నార్కెల్లింగ్ చేసేటప్పుడు అందరూ ఇయర్ ప్లగ్స్ ధరించాలని కోరింది.