- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యరశ్మి లేదా సప్లిమెంట్స్.. విటమిన్ డికి ఏది మంచిది ?
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలో తగినంత సూర్యరశ్మి ఉన్నప్పటికీ 70 నుండి 80 శాతం మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతుంటారు. అయితే సూర్యకిరణాలు విటమిన్ డికి ఉత్తమ వనరుగా చెబుతారు నిపుణులు. ఉదయపు సూర్యకిరణాలు శరీరం పై పడడం వలన శరీరంలో విటమిన్ డి వేగంగా ఉత్పత్తి అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
విటమిన్ డి మన శరీరానికి చాలా ముఖ్యం. దీని లోపం వల్ల ఎముకల్లో బలహీనత, అలసట మొదలవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. NIH అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నివేదిక ప్రకారం, ఒక సంవత్సరం నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తిలో విటమిన్ డి 50 నానోమోల్స్/లీటర్ నుంచి 125 నానోమోల్స్/లీటర్ మధ్య ఉండాలి. దీని కంటే తక్కువ స్థాయిలు విటమిన్ డి లోపం వర్గంలోకి వస్తాయంటున్నారు నిపుణులు.
శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నప్పుడు వైద్యులు ఈ లోపాన్ని విటమిన్ డి సప్లిమెంట్లతో భర్తీ చేస్తారు. అయితే విటమిన్ డి సూర్యకిరణాల నుండి పొందితే మంచిదా లేదా సప్లిమెంట్లను తీసుకుంటే మంచిదా అని ఈ రెండింటిలో విటమిన్ D ఉత్పాదనకు ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో విటమిన్ డి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు దాని లోపంతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం క్రమరహిత జీవనశైలి, బేసి పని గంటలు, ఎక్కువసేపు AC గదులలో గడపడం. దీని కారణంగా సూర్యరశ్మికి నిలబడటం తగ్గిపోతుంది.
సూర్యకాంతి..
మన ఓపెన్ స్కిన్ ని సూర్యుని అతినీలలోహిత కిరణాలు తాకినప్పుడు, అది కిరణాల నుండి విటమిన్ డీని గ్రహిస్తుంది. చర్మంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను విటమిన్ డిగా మారుస్తుందంటున్నారు నిపుణులు. అందుకే ఒక వ్యక్తి తగినంత సూర్యరశ్మిని తీసుకుంటే అతనికి విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం లేదని అంటారు. ఇప్పుడు సూర్యరశ్మి శరీరానికి తాకడం తగ్గిపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి, సప్లిమెంట్లు అవసరం అవుతున్నాయి.
విటమిన్ డి సప్లిమెంట్స్ ఎలా పని చేస్తాయి?
సహజంగా విటమిన్ డిని ఉత్పత్తి చేసుకోలేని వ్యక్తులు మాత్రమే ఈ సప్లిమెంట్లను ఉపయోగిస్తారు. కానీ మీరు తగినంత మొత్తంలో సూర్యకాంతి ఉన్న ప్రదేశంలో ఉన్నట్లయితే, ఈ సప్లిమెంట్ల పై ఆధారపడాల్సిన అవసరం లేదంటున్నారు. సప్లిమెంట్లకు బదులుగా ఉదయం కొన్ని నిమిషాలు సూర్య కిరణాలలో ఉండాలంటున్నారు నిపుణులు.
సప్లిమెంట్స్ దుష్ప్రభావాలు..
సహజమైన సూర్యరశ్మిలో నిలబడితే శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. అప్పుడు సప్లిమెంట్లను తీసుకోవలసిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల శరీరంలో అనేక దుష్ప్రభావాలు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఫలితంగా శరీరంలో కాల్షియం తక్కువగా ఉంటుంది. ఇది ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణం కావచ్చు. అలాగే విటమిన్ డి ఔషధం ఖరీదైనది. కానీ నాచురల్ విటమిన్ డీ కోసం సూర్య కిరణాలను ఉచితంగా పొందవచ్చు.
కొంతమంది వైద్యనిపుణులు మాట్లాడుతూ తగినంత సూర్యరశ్మి ఉన్న ప్రాంతాల్లో, సూర్యరశ్మి నుండి విటమిన్ డి తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. ఎందుకంటే సప్లిమెంట్‌లు అనేక ప్రతికూలతలను కలిగి ఉంటాయంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది తక్కువ సూర్యకాంతి ఉన్న ప్రదేశంలో నివసిస్తుంటే మీకు సప్లిమెంట్లు అవసరం కావచ్చు. అదుకే దేనినైనా వాడేందుకు ముందు ఖచ్చితంగా మీ వైద్యుడిని సంప్రదించండి.
* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.