ప్లాస్టిక్‌ను తింటున్న బ్యాక్టీరియా.. అయినా సరే వినాశకరమైన ప్రభావం

by Hajipasha |   ( Updated:2023-01-30 09:59:02.0  )
ప్లాస్టిక్‌ను తింటున్న బ్యాక్టీరియా.. అయినా సరే వినాశకరమైన ప్రభావం
X

దిశ, ఫీచర్స్: ప్లాస్టిక్ భూగోళాన్ని పూర్తిగా కలుషితం చేసింది. ప్రతి ఏటా 12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ మహాసముద్రంలోకి చేరుతోంది. కానీ, ఇందులో కొంత ప్లాస్టిక్ కనిపించకుండా పోతోందని నమూనా సర్వేలు గుర్తించాయి. 'ఇంతకీ ఈ ప్లాసిక్ట్ ఎక్కడికి వెళ్తుంది?' అనేది ప్రశ్న. కాగా బ్యాక్టీరియా ఇందులో కొంత భాగాన్ని తింటుందని కనుగొన్నారు రాయల్ నెదర్లాండ్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సీ రీసెర్చ్ (NIOZ) సైంటిస్టులు.

ప్లాస్టిక్ సముద్రంలోకి ప్రవేశించినప్పుడు.. సూర్యరశ్మి దానిని చిన్న చిన్న భాగాలుగా క్షీణింపజేస్తుందని NIOZ స్టూడెంట్ మైకే గౌడ్రియన్ వివరించాడు. 'రోడోకాకస్ రూబర్' అనే బగ్ బాక్టీరియం ప్లాస్టిక్‌ను తింటుందని.. దానిని జీర్ణం చేసి కార్బన్ డై యాక్సైడ్, ఇతర మాలిక్యూల్స్‌గా మారుస్తుందని తెలిపాడు. ఇలా నిరూపించడం ఇదే మొదటిసారి కాగా మహా సముద్రాల్లో ప్లాస్టిక్ సమస్యకు ఇది కచ్చితంగా పరిష్కారం మాత్రం కాదని చెప్పాడు. అయితే మహా సముద్రాలలో తప్పిపోయిన ప్లాస్టిక్ ఎక్కడికి పోయింది అనే ప్రశ్నకు ఇదొక సమాధానమని చెప్పుకొచ్చాడు.

దురదృష్టవశాత్తు, బ్యాక్టీరియా స్వయంగా ప్లాస్టిక్‌కు ఒక పరిష్కారం కాదు. సముద్రపు ప్లాస్టిక్‌లో ఒక శాతం బ్యాక్టీరియా తిన్నా, మిగిలిన 99 శాతం వన్యప్రాణులపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచంలోని 90 శాతానికి పైగా సముద్ర పక్షుల గట్‌లలో ప్లాస్టిక్‌ ఉంది. భూమిపై ప్లాస్టిక్ కుళ్లిపోవడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. ఇప్పటి వరకు సృష్టించబడిన 10 బిలియన్ టన్నుల ప్లాస్టిక్‌లో, అత్యధికంగా 6 బిలియన్లు పల్లపు ప్రదేశాలలో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. అయితే ప్లాస్టిక్ రీసైక్లింగ్ కొన్ని దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (OECD) 2022 నివేదికలో కేవలం 9 శాతం ప్లాస్టిక్ విజయవంతంగా రీసైకిల్ చేయబడిందని కనుగొంది.

READ MORE

'12 హవర్ వాక్ చాలెంజ్'.. గ్లోబల్ మోమెంట్‌ను ప్రారంభించిన ఓ బ్రాడీ

Advertisement

Next Story

Most Viewed